Sree Mukhi: పాన్ ఇండియా హీరోతో.. రెండోసారి 

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:17 AM

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి (Sreemukhi) బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందని టాక్‌. టీవీ రంగంలో యాంకర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతూనే సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా సెలెక్టివ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ మెప్పిస్తోంది.

Sree Mukhi: పాన్ ఇండియా హీరోతో.. రెండోసారి 
Allu arjun, Sreemukhi

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి (Sreemukhi) బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందని టాక్‌. టీవీ రంగంలో యాంకర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతూనే సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా సెలెక్టివ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ మెప్పిస్తోంది. తాజాగా ఆమె మరో క్రేజీ ఆఫర్‌ కొట్టేసిందని వార్తలొస్తున్నాయి. పాన్‌ ఇండియా హీరో సినిమాలో అవకాశం దక్కించుకుందని ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అల్లు అర్జున్‌ (Allu arjun)- అట్లీ (Atlee) కాంబోలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందని, బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న అధికారికంగా ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ పాజెక్ట్‌లో శ్రీముఖి నటించనున్నట్లు సమాచారం. ఇందులో బన్నీకి చెల్లెలిగా  ఆమె కనిపించనుందని టాక్‌. ఇప్పటికే వీరిద్దరూ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ుజులాయి’లో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి వెండితెరపై కనిపించనున్నారని ప్రచారం గట్టిగా జరుగుతోంది.

Murali Mohan: కీరవాణి కుమారుడితో పెళ్లి!

Bunny.jpg

గత ఏడాది మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్‌ సినిమాలో శ్రీముఖి నటించింది. ఇందులో ఖుషీ నడుమ సీనతో ఆకట్టుకుంది. సోషల్‌ వీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి ట్రెండీ డ్రెస్‌లు ధరించి కుర్రకారులో హీట్‌ పెంచుతుంది. 

Updated Date - Apr 06 , 2024 | 11:23 AM