మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Laggam: మాట, ముచ్చటతో.. ‘లగ్గం’ ఎంత వరకు వచ్చిందంటే..

ABN, Publish Date - Feb 15 , 2024 | 02:56 PM

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గురువారంతో ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తవుతుందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Laggam Movie Still

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’ (Laggam). ‘భీమదేవరపల్లి బ్రాంచి’ (Bhimadevarapalli Branch) సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గురువారం (ఫిబ్రవరి 15)తో ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తవుతుందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అలాగే ఫిబ్రవరి 23 నుండి వరపూజతో రెండవ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, మొదటి షెడ్యూల్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందని.. ప్రతి సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలియజేశారు. రాజేంద్రప్రసాద్ (Nata Kireeti Rajendra Prasad), రోహిణి, సాయి రోనాక్, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ విలువలను, మర్చిపోతున్న సాంప్రదాయాలను, సంస్కృతిని మళ్లీ గుర్తుచేసే... అరుదైన చిత్రంగా ఉంటుందని.. ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.


ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా, ‘బేబి’ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేస్తామన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

***********************

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

Updated Date - Feb 15 , 2024 | 02:56 PM