Rajamouli- David warner: నవ్వులు పూయిస్తున్న ప్రకటన

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:20 PM

టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David warner) కలిసి నటించిన ఓ యాడ్‌ నెట్టింట  నవ్వుల పూవ్వులు పూయిస్తోంది.

Rajamouli- David warner: నవ్వులు పూయిస్తున్న ప్రకటన
SS Rajamouli- David warner


టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David warner) కలిసి నటించిన ఓ యాడ్‌ నెట్టింట  నవ్వుల పూవ్వులు పూయిస్తోంది. క్రెడ్‌ యూపీఐ ప్రమోషన్‌ (Cred Ad) యాడ్‌లో భాగంగా వీరిద్దరూ కలసి నటించారు. ఇందులో రాజమౌళి దర్శకుడి అవతారంలో కనిపించగా.. డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన యాక్టింగ్‌తో నవ్వులు పూయించాడు. ‘‘టికెట్లపై డిస్కౌంట్‌ కావాలంటే ఏం చేయాలి’’ అంటూ రాజమౌళి డేవిడ్‌ వార్నర్‌ను ఫోన్‌లో సంప్రదించడంతో యాడ్‌ మొదలైంది.

దానికి వార్నర్‌ క్రెడ్‌ను వినియోగించాలని సూచిస్తాడు. ‘ఇంకో మార్గం లేదా?’ అంటూ రాజమౌళి అడగ్గా.. ‘తనకు ఫేవర్‌ చేయాలని వార్నర్‌ అంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రాజమౌళి రూపొందించిన చిత్రాల్లోని పాత్రల్లో వార్నర్‌ నటిస్తే ఎలా ఉంటుందో అందులో చూపించారు. మధ్య ‘ఆస్కార్‌ వేదికగా కలుద్దాం’.. ‘గుర్రానికి బదులు కంగారు లేదా?’ అంటూ వార్నర్‌ చేత పలికించిన సంభాషణలు వినోదాత్మకంగా ఉన్నాయి. కొన్నిసార్లు ఫేవర్‌ కూడా మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయంటూ ఈ యాడ్‌ను క్రెడ్‌ తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ సరదా వీడియోపై ఓ లుక్కేయండి..

Yash: ప్రపంచ వేదికపై రామాయణం దద్దరిల్లాలి!


Updated Date - Apr 12 , 2024 | 04:39 PM