Yash: ప్రపంచ వేదికపై రామాయణం దద్దరిల్లాలి!

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:47 PM

కేజీఎఫ్‌ స్టార్‌ యశ్  (Yash) సంచలన ప్రకటన చేశారు. మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, నమిత్‌ మల్హోత్రా(Namith malhotra) , ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌తో కలిసి రామాయణాన్ని9Ramayanam) వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.

 Yash: ప్రపంచ వేదికపై రామాయణం దద్దరిల్లాలి!
Yash - Ramayanam

కేజీఎఫ్‌ స్టార్‌ యశ్  (Yash) సంచలన ప్రకటన చేశారు. మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌, నమిత్‌ మల్హోత్రా(Namith malhotra) , ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌తో కలిసి రామాయణాన్ని9Ramayanam) వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. "ఇప్పటి వరకూ రామాయణం ఇతివృత్తంగా ఎన్ని సినిమాలు వచ్చినా కచ్చితమైన రామాయణం ఎవరికీ తెలీదు. ఇప్పుడు అసలైన రామాయణాన్ని తీయబోతున్నాం’’ అని నిర్మాణ సంస్థ ప్రకటించాయి. నితేష్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహించనున్నారు. డిఎన్ఈజీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఇప్పటి వరకూ చూడని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయని చెబుతున్నారు.

యష్‌ మాట్లాడుతూ "రామాయణం మన జీవితాలకు ముడిపడి ఉన్న కథ. అందులో జ్ఞానం, భావజాలం ఇలా ఎన్నో నిగూడ అంశాలున్నాయి. గ్లోబల్‌ వేదికపై, ఈ అద్భుతమైన రామయణాన్ని వెండి తెర మీద చూపించాలి. అందులో ఉన్న ఎమోషన్స్‌, వాల్యూస్‌ అన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. ఇదే ప్రస్తుత లక్ష్యం. నాకు ఎప్పటి నుంచో ఉన్న కల ఇది. మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, నమిత్‌ నేను రామాయణం చేేస్త బాగుంటుందని చాలాసార్లు అనుకున్నాం. కానీ ఇలాంటి సబ్జెక్ట్‌ తీయాలంటే మామూలు విషయం కాదు. బడ్జెట్‌ కూడా భారీగా ఉండాలి. అందుకే నేను కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించాలనుకుంటున్నా. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తాను. దీనికి నితీష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు’’ అని అన్నారు.


నమిత్‌ మల్హోత్ర మాట్లాడుతూ "యుఎస్‌; యుకె వంటి ప్రాంతాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్‌ సక్సెస్‌ తెచ్చుకుని, ఆస్కార్‌ వరుకు వెళ్లిన నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలననే నమ్మకం ఉంది. ఎక్కడో కర్ణాటక నుండి వచ్చి ఈరోజు ప్రపంచం గర్వించే కెజీఎఫ్‌-2 వరుకు, యష్‌ చాలా కష్టపడ్డాడు. ఇలాంటి ప్రాజెక్ట్‌ ప్రపంచ వేదికపై మెరవాలి అంటే యష్‌ లాంటి వారితోనే సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 02:47 PM