Rajamouli: దర్శకత్వంలోనే కాదు.. డాన్స్ లో కూడా మాస్టరే

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:42 PM

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... ఫ్యామిలీ, పర్సనల్‌ లైఫ్‌కు కేటాయించాల్సిన సమయాన్ని తప్పకుండా కేటాయిస్తారు దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli). షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికినా.. ప్రతిసారి కుటుంబసభ్యులతో గడుపుతారు.

Rajamouli: దర్శకత్వంలోనే కాదు.. డాన్స్ లో  కూడా మాస్టరే
Rajamouli - Rama

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... ఫ్యామిలీ, పర్సనల్‌ లైఫ్‌కు కేటాయించాల్సిన సమయాన్ని తప్పకుండా కేటాయిస్తారు దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli). షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికినా.. ప్రతిసారి కుటుంబసభ్యులతో గడుపుతారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ డాన్స్ (Dance Video viral) వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఓ పెళ్లి వేడుకలో సతీసమేతంగా పాల్గొన్న రాజమౌళి, రమా (Rama Rajamouli) ప్రభుదేవా పాటకు స్టెప్పులేసి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రాగా విపరీతంగా వైరల్‌ అయింది. తాజాగా ఆయన డాన్స్ రిహార్సెల్‌ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంతకీ అది ఏ వేడుకలో అంటే..

మైత్రి మూవీ మేకర్స్‌ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేశారు.. ప్రభుదేవా ఆల్‌టైమ్‌ హిట్స్‌లో ఒకటైన 'ప్రేమికుడు' చిత్రంలోని ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ వీడియో  తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. రాజమౌళి-రమ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అందులో రాజమౌళి స్టెప్పులకు ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. ప్రాక్టీస్‌లో కూడా పెర్‌ఫెక్షన్  చూపించారు జక్కన్న. 'డైరెక్షన్ లోనే కాదు డాన్స్ లోనూ  మీరు మాస్టరే సార్‌' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Pushpa 2: సుకుమార్‌ కష్టం మామూలుగా లేదుగా..!



రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌ బాబుతో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' చిత్రం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్, ఫొటో షూట్‌లతో బిజీగా ఉన్నారు. యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కె.విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌, వివిధ సినీ రంగాల తారలు భాగం కానున్నారు. 

Raja saab: ప్రభాస్‌తో మారుతి టార్గెట్‌ అదే!


Updated Date - Apr 11 , 2024 | 03:44 PM