Allu Arjun: పుష్ప-2 విడుదలపై క్లారిటీ! 

ABN , Publish Date - Jan 28 , 2024 | 05:34 PM

కారణం ఏదైనా కానీ ఓ సినిమా విడుదల వెనక్కి వెళ్లిందంటే దాని వెనకున్న చిత్రాల తలరాత కూడా మారిపోతుంది. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన 'ఈగల్‌’ చిత్రం విడుదల వాయిదా పడింది. దాని ప్రభావం ఆ తర్వాత విడుదల కావాల్సిన చిత్రాలపై పడుతుంది.

Allu Arjun: పుష్ప-2 విడుదలపై క్లారిటీ! 

కారణం ఏదైనా కానీ ఓ సినిమా విడుదల వెనక్కి వెళ్లిందంటే దాని వెనకున్న చిత్రాల తలరాత కూడా మారిపోతుంది. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన 'ఈగల్‌’ చిత్రం విడుదల వాయిదా పడింది. దాని ప్రభావం ఆ తర్వాత విడుదల కావాల్సిన చిత్రాలపై పడుతుంది. అలా కొన్ని చిత్రాలు ఎఫెక్ట్‌ అయినట్లు సమాచారం. కొన్ని చిత్రాలు ముందు వెనుక అయినట్లు వార్తలొస్తున్నారు. భారీ చిత్రాల విషయానికొస్తే ఏప్రిల్‌ 5న విడుదల కానున్న 'దేవర’ చిత్రం పలు కారణాలతో వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే అల్లు అర్జున్  హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప-2' చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కావాల్సిన ఉంది. ఆ చిత్రం విడుదల కూడా వాయిదా పడిందని  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


అయితే దీనిపై అల్లు అర్జున్ టీమ్‌ డిజిటల్‌ టీమ్‌ స్పందించింది. పుష్ప-2 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. అనుకున్నట్లుగానే పుష్పరాజ్‌ ఆగస్ట్‌ 15న గ్రాండ్‌గా థియేటర్స్లో సందడి చేయనున్నాడు.  పుష్ప  ర్యాంపేజ్‌కి అంతా సిద్ధంకండి’’ అని పోస్ట్‌ చేశారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. 


Updated Date - Jan 28 , 2024 | 05:34 PM