Puri Musings: ఇవన్నీ బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు!

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:13 AM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తారో అంతే ఎగ్జైటింగ్‌గా ఆయన మ్యూజింగ్స్‌ (Puri Musings) కోసం కూడా ఎదురు చూస్తారు.  యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో వివిధ అంశాలపైౖ తన అభిప్రాయాలను చెబుతుంటారు.

Puri Musings: ఇవన్నీ బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు!


డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తారో అంతే ఎగ్జైటింగ్‌గా ఆయన మ్యూజింగ్స్‌ (Puri Musings) కోసం కూడా ఎదురు చూస్తారు.  యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో వివిధ అంశాలపైౖ తన అభిప్రాయాలను చెబుతుంటారు. తాజాగా ఆయన మ్యూజింగ్‌లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన వెంటనే కోలుకొని సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని ఆయన అన్నారు. 

‘మన శరీరానికి ఏదైనా గాయమైతే మన బాడీ దాన్ని తగ్గించే పనిలో పడిపోతుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి సమయం పడుతుంది. మరికొన్ని నయం కావడానికి వారాలు పట్టొచ్చు. కానీ, గాయమైతే తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మన మనసుకు దెబ్బ తగులుతుంది. కన్నవాళ్లు చనిపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, నమ్మినవాళ్లు మోసం చేయొచ్చు. వీటివల్ల మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలి. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఏం జరిగినా.. ఎంత అనర్థం జరిగినా త్వరగా మామూలు మనిషిగా మారాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. రోజులు తరబడి ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు రావాలి’. అంతే కాదు పక్కవారి సంపథీ కోసం ఎప్పుడూ ఎదురుచూడొద్దు. మనల్ని ఎవరూ ఓదార్చకూడదు. మనకు మనమే ధైౖర్యం చెప్పుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి?. కానీ, వెంటనే పనిలో బిజీగా మారండి. ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిస అవుతారు. దయచేసి అలా చేయకండి. అది చాలా పిచ్చి పని. ఎంత నష్టం వచ్చినా.. తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంత కష్టం వచ్చినా ఒత్తిడిగా బావించొద్దు. అన్నం తినడం మానొద్దు. నీళ్లు తాగడం ఆపొద్దు. కావాల్సినంత నిద్ర పోవాలి. మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి. అలా చేస్తేనే వీలైనంత త్వరగా కోలుకుంటాం. ‘ఏం జరిగినా తర్వాత ఏంటి అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. నువ్వు చనిపోతున్నావని గంట ముందు తెలిసినా.. తర్వాత ఏం చేయాలో చేేసయ్‌. ఇవన్నీ మనం బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు. ఊపిరి వదిలేవరకు వీటిని ఫేస్‌ చేయాల్సిందే. ఎవరికి వారే నచ్చజెప్పుకోవాలి. అలా చేసినవారే అందరికంటే గొప్పవారు’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు.

Jr NTR: బాలీవుడ్‌ స్టార్స్‌ పార్టీలో తారక్‌!


Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 30 , 2024 | 10:17 AM