Jr NTR: బాలీవుడ్‌ స్టార్స్‌ పార్టీలో తారక్‌!

ABN , Publish Date - Apr 29 , 2024 | 02:17 PM

జూ.ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'దేవర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తూ 'వార్‌ 2’ కూడా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఆయన ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే!

Jr NTR: బాలీవుడ్‌ స్టార్స్‌  పార్టీలో తారక్‌!
Jr Ntr And bollywood celebs

జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) ప్రస్తుతం 'దేవర’ (Devara) చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తూ 'వార్‌ 2’ (War-2)కూడా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఆయన ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే! అక్కడ బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, కరణ్‌ జోహార్‌, రణబీర్‌, అలియా భట్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఓ పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీలో తారక్‌ భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi pranati) కూడా పాల్గొన్నారు. డిన్నర్‌ ముగించుకుని బయటకు వస్తుండగా ఫ్యాన్స్  ఫొటోల కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను ఓ లేడీ ఫ్యాన్‌ సెల్ఫీ  ఇవ్వాలంటూ రిక్వెస్ట్‌ చేసింది. ఈరోజు తన బర్త్‌డే అని చెప్పడంతో ఎన్టీఆర్‌ పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చారు. ఇక పార్టీ తర్వాత వీరంతా బయటికి వస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Mahesh - Manjula: అక్కా - తమ్ముడు క్యూట్ వీడియో వైరల్‌!


దేవర’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్ కు  గాయం కావడంతో షూటింగ్‌ వాయిదా పడింది. దాంతో తారక్‌ 'వార్‌-2' (war 2)పై దృష్టి పెట్టారు. ఈ సినిమా కోసం 60 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం. 2025 ఆగష్టు 14న సినిమాను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఇక 'దేవర’ చిత్రానికొస్తే రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ ఏడాది అక్టోబర్‌ 10న మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో కథానాయిక. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. (karan Johar)

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 29 , 2024 | 02:26 PM