నిర్మాత ఎస్.కే.ఎన్‌కు పితృవియోగం.. ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jan 04 , 2024 | 08:55 PM

టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్వయంగా ఫోన్ చేసి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ఎస్‌కేఎన్ కుటుంబ సభ్యులకు ఓదార్పు నిచ్చారు. ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ తరుపున సంతాప సందేశాన్ని పంపారు.

నిర్మాత ఎస్.కే.ఎన్‌కు పితృవియోగం.. ప్రగాఢ సంతాపాన్ని తెలిపిన పవన్ కల్యాణ్
SKN With His Father

టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్వయంగా ఫోన్ చేసి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ఎస్‌కేఎన్ కుటుంబ సభ్యులకు ఓదార్పు నిచ్చారు. ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ తరుపున సంతాప సందేశాన్ని పంపారు. జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరిగిన గాదె సూర్య ప్రకాశ రావు అంత్యక్రియల్లో నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు శిరీష్, దర్శకుడు మారుతి, దర్శక నిర్మాత సాయి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


Janasena.jpg

గాదె సూర్యప్రకాశ రావు మరణ వార్త తెలియగానే దర్శకులు మారుతి, హరీశ్ శంకర్, నిర్మాత నాగవంశీ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. ఎస్‌కేఎన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వెల్లడించారు. ఈ బాధాసమయంలో ఎస్‌కేఎన్ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఒక హీరో. ఇవాళ నా జీవితంలోని హీరోను కోల్పోయాను. నేను నిర్మాతగా చేసిన బేబి సినిమా ఘన విజయాన్ని సాధించడం నాన్న కళ్లారా చూసి ఆనందించారు. నాన్న మృతితో నాకు మాటలు రావడం లేదు. ప్రపంచాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోంది. నన్ను ప్రోత్సహించి, అండగా నిలబడి, నడిపించే శక్తి ఇక లేదు. కన్నీళ్లు ఆగడం లేదు. ఈ బాధలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇచ్చిన పవన్ కల్యాణ్ గారికి, అల్లు అరవింద్ గారికి, అల్లు శిరీష్, మారుతి ఇతర మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

******************************

*దీనస్థితిలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ సాయం

**************************

*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

************************

Updated Date - Jan 04 , 2024 | 08:56 PM