Prabhas: చాలాకాలం తర్వాత.. ఒకరు కాదు ఏకంగా ముగ్గురితో..

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:13 PM

మాస్‌ హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు కాలు కదిపితే ఆ కిక్కే వేరు. అదే ముగ్గురు హీరోయిన్లు  చిందేస్తే డాల్బీ అట్మాస్‌ థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అలాంటి సందడే ‘ది రాజా సాబ్‌’లో చేయనున్నారు

Prabhas:  చాలాకాలం తర్వాత.. ఒకరు కాదు ఏకంగా ముగ్గురితో..

మాస్‌ హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు కాలు కదిపితే ఆ కిక్కే వేరు. అదే ముగ్గురు హీరోయిన్లు  చిందేస్తే డాల్బీ అట్మాస్‌ థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. అలాంటి సందడే ‘ది రాజా సాబ్‌’లో (The Raja saab) చేయనున్నారు  పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas). ఆయన కథానాయకుడిగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్‌ లుక్‌ అభిమానుల్ని ఫిదా చేసింది. ప్రభాస్‌ మాస్‌ ఇమేజ్‌, మారుతి స్టైల్‌ కామెడీ వెరసి ఫ్యాన్సతో ఈలలు వేయించే మూమెంట్స్‌కు కొదవ లేదంటున్నారు మారుతి. అందుకోసమే ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు పొందుపరిచారు. వాటితో ప్రత్యేక గీతం ఒకటి. ప్రభాస్‌ స్టైలిష్‌ డాన్స చూసి చాలా కాలమైంది. ఆ లోటు ‘రాజా సాబ్’తో  తీరబోతోంది. ఇందులో నిధీ అగర్వాల్‌, రిద్దికుమార్‌, మాళవిక మోహనన్‌ నాయికలుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురితో ప్రభాస్‌ ఆడిపాడేలా ఓ పాట డిజైన చేశారు.  ఈ పాట థియేటర్లని ఓ ఊపు ఊపేయ్యబోతోందని టాక్‌ వినిపిస్తోంది. డార్లింగ్‌తో మాసీ స్టెప్పులు  వేయించాలన్న లక్ష్యంతోనే మారుతి ఈ పాటను డిజైన చేశారట. ఈ మధ్యకాలంలో స్టార్‌ హీరో పక్కన ముగ్గురు హీరోయిన్లు డాన్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ తరంలో ఏ హీరోకీ ఈ ఛాన్స్ రాలేదని చెప్పాలి. (Malavika Mohanan, Riddhi Kumar, Nidhhi Agerwal)

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ పూర్తయింది. వచ్చే నెలలో మరో షెడ్యూల్‌ మొదలుకానుంది. రొమాంటిక్‌ హారర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకొంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. 2025 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Jr NTR: బాలీవుడ్‌ స్టార్స్‌ పార్టీలో తారక్‌!



Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 29 , 2024 | 03:16 PM