scorecardresearch

Robinhood: నితిన్‌ సినిమా వెనక్కి వెళ్లింది..  

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:48 PM

నితిన్‌ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Robinhood: నితిన్‌ సినిమా వెనక్కి వెళ్లింది..  


నితిన్‌ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. అనుకోని పరిస్థితుల వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందంటూ మైత్రీ మూవీస్‌ పోస్ట్‌ పెట్టింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. నితిన్‌- వెంకీ కుడుముల కలయికలో రానున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల చిత్రబృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ షూటింగ్‌ అప్‌డేట్‌ పంచుకుంది. షూటింగ్‌ దాదాపు పూర్తయిందని ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని చెప్పారు.  అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కారణంగా సినిమా విడుదల ఆలస్యబైనట్లు సమాచారం. నితిన్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. (Robinhood postponed)

Updated Date - Dec 17 , 2024 | 03:48 PM