Robin Hood: ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. నితిన్ ,వెంకీ కుడుముల కొత్త చిత్రం ‘రాబిన్‌హుడ్‌’

ABN , Publish Date - Jan 26 , 2024 | 04:13 PM

నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో తాజాగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టిస్తూ ఈ రోజు (శుక్ర‌వారం) ఓ గ్లిమ్స్‌ విడుద‌ల చేశారు.

Robin Hood: ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. నితిన్ ,వెంకీ కుడుముల కొత్త చిత్రం ‘రాబిన్‌హుడ్‌’
robinhood

నితిన్‌ (nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేష‌న్‌లో తాజాగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో భీష్మ సినిమా వ‌చ్చి భారీ విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. రెండు నెల‌ల క్రితమే ఈ సినిమాను ప్ర‌క‌టించగా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రామబిన్ హుడ్‌గా ప్ర‌క‌టిస్తూ ఈ రోజు (శుక్ర‌వారం) రోజున‌ ఓ గ్లిమ్స్‌ విడుద‌ల చేశారు.

ఈ గ్లింప్స్‌లో నితిన్ గెటప్, డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి చిత్రంపై అంచ‌నాలు పెంచుతున్నాయి. ‘ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. ఆభరణాలేసుకున్నవాళ్లంతా నా అక్క చెల్లెళ్లు.. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబరని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవ్వలేదు ఎందుకంటే అయినవాళ్ల దగ్గరకు తీసుకోవడం నా హక్కు. మై బేసిక్ రైట్.. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ‘ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో విడుద‌ల చేసిన‌ గ్లింప్స్ ఆక‌ట్టుకుంటున్న‌ది.


మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Official) నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్ర‌కాశ్ (gv prakash) సంగీతం అందిస్తున్నాడు. అయితే మొద‌ట‌గా ర‌ష్మిక‌ను హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసి, బాగా ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ ర‌ష్మిక ఈ చిత్రం నుంచి వైదొలిగి ఆ స్థానంలో శ్రీలీల చేరిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి కానీ ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. అయితే ఈ సినిమాలో నితిన్ ఓ దొంగ పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా ఈ నెలాఖ‌రు నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇదిలాఉండ‌గా గతేడాది నితిన్ న‌టించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇప్పుడు నితిన్ ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

Updated Date - Jan 26 , 2024 | 04:13 PM