Karthikeya 3: అంతకు మించి భారీ స్థాయిలో...

ABN , Publish Date - Mar 17 , 2024 | 07:08 PM

‘కార్తికేయ 2’తో సూపర్‌హిట్‌ అందుకున్నారు నిఖిల్‌(Nikhil). చందు మొండేటి (Chandoo mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయం అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ (Karthikeya 3) కూడా ఉంటుందని దర్శకుడు అప్పుడే ప్రకటించారు.

Karthikeya 3: అంతకు మించి భారీ స్థాయిలో...


‘కార్తికేయ 2’తో సూపర్‌హిట్‌ అందుకున్నారు నిఖిల్‌(Nikhil). చందు మొండేటి (Chandoo mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ విజయం అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ (Karthikeya 3) కూడా ఉంటుందని దర్శకుడు అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ చిత్రం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అని నిఖిల్‌ తాజాగా పోస్ట్‌ పెట్టారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ - చందు కాంబోలో మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు  సిద్థంగా ఉన్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. గత చిత్రంలో కంపేర్‌ చేస్తే ఇది భారీ స్థాయిలో ఉండబోతోందని టాక్‌. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా రాబోతున్న మూడో చిత్రమిది. 2014లో విడుదలైన ‘కార్తికేయ’తో ఈ కాంబో తొలి విజయాన్ని అందుకుంది. ‘కార్తికేయ 2’తో పాన ఇండియా స్థాయిలో హిట్‌ అందుకున్నారు.  కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, హర్ష, శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రధారులు. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభూ' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Updated Date - Mar 17 , 2024 | 07:08 PM