Neti Bharatham: ‘నేటి భార‌తం’పై చంద్ర‌బాబు నాయుడు ప్రశంసలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:14 PM

ఒకే పాత్ర‌తో.. సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భార‌తం’. భ‌ర‌త్ పారేప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ర్రా శ్రీధ‌ర్ రాజు న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. అతి త్వరలోనే సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. అంతకుముందు ఈ ట్రైలర్ చూసిన చంద్రబాబు టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

Neti Bharatham: ‘నేటి భార‌తం’పై చంద్ర‌బాబు నాయుడు ప్రశంసలు
Neti Bharatham Movie Stills

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ‘నేటి భార‌తం’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడమే కాకుండా.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారని అన్నారు న‌టుడు, నిర్మాత డా. య‌ర్రా శ్రీధ‌ర్ రాజు. ఒకే పాత్ర‌తో.. సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భార‌తం’ (Neti Bharatham). భ‌ర‌త్ పారేప‌ల్లి (Bharat Parepalli) ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ర్రా శ్రీధ‌ర్ రాజు న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. అతి త్వరలోనే సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాంబేష్ మాట్లాడుతూ.. నిర్మాత డా. శ్రీధ‌ర్ రాజు సినిమా ఇండ‌స్ట్రీకి మంచి చిత్రాలు చేయాల‌ని వ‌చ్చారు. అందులో భాగంగానే తొలి సినిమాగా ‘మేరా భార‌త్ మ‌హాన్’ అనే ఒక అద్భుత‌మైన చిత్రం చేశారు. దానికి మంచి పేరొచ్చింది. ప్ర‌స్తుతం ఒకే పాత్ర‌తో శ్రీధ‌ర్ ‘నేటి భార‌తం’ అనే మరో గొప్ప చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌డుతున్న‌ ఇబ్బందులను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాని అన్నారు. వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. శ్రీధ‌ర్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా చూశాను. స‌మాజంలో ఉన్న అసమాన‌త‌ల‌పై  ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఈ చిత్రం అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రం విజ‌యం సాధించాని ఆశిస్తున్నానని అన్నారు.


Bharath.jpg

న‌టుడు, నిర్మాత డా. య‌ర్రా శ్రీధ‌ర్ రాజు మాట్లాడుతూ.. క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన ఆర్థిక‌, సామాజిక స్థితి గ‌తుల‌పై ఈ చిత్రం ఉంటుంది. ముఖ్యంగా పాలసీ మేకింగ్‌తో పాటు ఆ పాల‌సీల వెన‌కాల రాజ‌కీయ నాయ‌కుల స్వార్థాలు, వాటి అమ‌లు తీరు ఇలా ప‌లు సోష‌ల్ ఇష్యూస్‌పై ఈ సినిమా చేశాము. కీర్తి శేషులు పెద్దాడ‌మూర్తి ఈ చిత్రానికి అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. ఇందులో నేను జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించాను. దీనికి తెర‌వెనుక హీరో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ పారేప‌ల్లినే. త‌న‌తో నేను విద్య‌, వైద్యం మీద ‘మేరా భార‌త్ మ‌హాన్’ అనే చిత్రం చేశాను. దానికి మంచి పేరొచ్చింది. అందులో నేను మంచి పాత్ర‌లో న‌టించా. ఆ ఇన్‌స్పిరేష‌న్‌తో ఒకే పాత్ర‌తో ఈ ‘నేటి భార‌తం’ చిత్రం చేశాను. ఈ చిత్రంలో ఏపీ రాజ‌ధాని ఇష్యూతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సున్నిత‌మైన అంశాల గురించి కూడా చ‌ర్చించాము. ఈ ట్రైల‌ర్ చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయిన చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu)గారు.. చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డమే కాకుండా మా టీమ్‌ని ఎంతో అభినందించారు. దీనికి కార‌ణ‌మైన క‌ర్నూల్ కి చెందిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి ధ‌న్య‌వాదాలు. ఏ వ్య‌క్తిని కించ‌ప‌ర‌చ‌కుండా కేవ‌లం పాల‌సీ మేకింగ్ గురించి మాత్ర‌మే మా చిత్రంలో చూపించాము. జ‌ర్న‌లిస్ట్ అంకిత‌భావం, తెగింపు మా చిత్రంలో చూపిస్తున్నాం. ఒక మంచి కాన్సెప్ట్‌తో సింగిల్ క్యారెక్ట‌ర్‌తో వ‌స్తోన్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నానని తెలపగా.. శ్రీధర్ రాజు ఇందులో అద్భుతంగా చేశారని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు దర్శకుడు దర్శకుడు భరత్ పారేపల్లి. (Neti Bharatham Trailer Launched)


ఇవి కూడా చదవండి:

====================

*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

**************************

*Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

****************************

Updated Date - Feb 17 , 2024 | 05:56 PM