Nagarjuna: నా సామిరంగ‌.. ఇప్పుడూ అదే మాట చెబుతున్నా!

ABN , Publish Date - Jan 14 , 2024 | 07:24 PM

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.

Nagarjuna: నా సామిరంగ‌.. ఇప్పుడూ అదే మాట చెబుతున్నా!
naa samiranga

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’(Naa Saami Ranga). ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (vijay binni) దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ (Allari naresh), రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని 'సంక్రాంతి కింగ్' గా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.

ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉన్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు, అభిమానుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, వారి అనందం చూస్తుంటే నాకు చాలా అనందంగా, తృప్తిగా ఉంది. మా యూనిట్ లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ ప్రేమతో, సంక్రాంతికి విడుదలవ్వాలి, పెద్ద విజయం సాధించాలనే సంకల్పంతో పని చేశారు. ఇప్పుడు ఫలితం కూడా అంత గొప్పగా వచ్చింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్టార్ కీరవాణి గారని మొదటి నుంచి చెబుతున్నాను. ఇప్పుడు అదే మాట చెబుతున్నా. అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు.


కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. రోజుకి కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయే వారు. మిగతా సమయం అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉండే వారు. ఇది హ్యుజ్ మూవీ. చాలా పాత్రలు వున్నాయి. ఇంతమందిని, ఇన్ని పాత్రలని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. తనకి చాలా గొప్ప భవిష్యత్ వుంటుంది. డివోపీ శివేంద్ర హనుమాన్ చేశాడు. అందులో తన వర్క్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా సినిమాలో కూడా చాలా చక్కటి వర్క్ చేశాడు. ఇక సంక్రాంతి అంటే శివేంద్రనే కెమరామ్యాన్ తీసుకుంటారేమో. ఇప్పుడు తను సంక్రాంతి అల్లుడు అంటు న‌వ్వులు పూయించారు.

నిర్మాత చిట్టూరి ఈ కథ వినగానే సూపర్ హిట్ అవుతుందని చెప్పారని, ఆయన చెప్పినట్లే అయ్యిందన్నారు. ఆయన గొప్ప ప్రోత్సాహం అందించారని. అలాగే పవన్, టెక్నిషియన్స్ అంతా చాలా కలసికట్టుగా పని చేశార‌న్నారు. నరేష్‌తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని తను చేసిన సీన్స్, డ్యాన్సులు, యాక్షన్ స‌న్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో తను ఎమోషన్ పండించక పోతే క్లైమాక్స్ పండేది కాదన్నారు. రాజ్ తరుణ్ కూడా చక్కని నటన కనబరిచాడు. మిర్నా, రుక్సర్, షబ్బీర్, రావు రమేష్ గారు, నాజర్ గారు అందరూ చక్కని పాత్రలలో ఒదిగిపోయార‌న్నారు. ఆషికా కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. అలాంటి పాత్ర చేయడం అంత సులువు కాదని అన్నారు.. తన పాత్రలోని రెండు లేయర్స్ ని చాలా అద్భుతంగా చేసిందని, తనకి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాన‌న్నారు.. మీడియా మిత్రులు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చార‌ని, అందరికీ ధన్యవాదాలంటూ ముగించారు.

Updated Date - Jan 14 , 2024 | 07:24 PM