OTT Streaming: 'నా సామిరంగ' స్ట్రీమింగ్  ఎప్పుడు.. ఎక్కడంటే! 

ABN , Publish Date - Feb 10 , 2024 | 11:18 AM

అక్కినేని నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా సంక్రాంతి బరిలో విడుదలై అలరించింది 'నా సామిరంగ' (Naa saami ranga) . విజయ్‌ బిన్నీ తెరకక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై హిట్‌గా నిలిచింది.

OTT Streaming:  'నా సామిరంగ' స్ట్రీమింగ్  ఎప్పుడు.. ఎక్కడంటే! 

అక్కినేని నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా సంక్రాంతి బరిలో విడుదలై అలరించింది 'నా సామిరంగ' (Naa saami ranga) . విజయ్‌ బిన్నీ తెరకక్కించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌, మిర్నా, రుక్సాన్‌ థిల్లన్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై హిట్‌గా నిలిచింది. క్లీన్  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మెప్పించిన ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్  అవుతుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు ఈ చిత్రం సిద్థమైంది.

Naa Saamiranga.jpg

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో నాగార్జున సందడి చేయనున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ఓటీటీలో  స్ట్రీమింగ్  కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమాకు కీరవాణి మ్యూజిక్‌ అందించడం విశేషం. శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ బ్యానర్‌ పై శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.  థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'నా సామిరంగ' ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి. 


Updated Date - Feb 10 , 2024 | 11:21 AM