‘నా సామిరంగ’ 5వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..

ABN , Publish Date - Jan 19 , 2024 | 03:23 PM

కింగ్ అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాధ్ హీరోహీరోయిన్లుగా.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘నా సామిరంగ’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. సంక్రాంతికి స్పెషల్‌గా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. విడుదలైన 5 రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించినట్లుగా మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.

‘నా సామిరంగ’ 5వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..
King Nagarjuna in Naa Saami Ranga

కింగ్ అక్కినేని నాగార్జున (King Nagarjuna), ఆషికా రంగనాధ్ (Ashika Ranganath) హీరోహీరోయిన్లుగా.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. సంక్రాంతికి స్పెషల్‌గా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. విడుదలైన 5 రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించినట్లుగా మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమా 5 రోజుల్లో రూ. 35.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా తెలుపుతూ.. 5వ రోజు రూ. 2.54 కోట్లు (షేర్) రాబట్టినట్లుగా డిటైల్డ్‌గా మేకర్స్ ప్రకటించారు. అలాగే.. సీడెడ్, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ మరియు వైజాగ్ ఏరియాల్లో ‘నా సామిరంగ’ సినిమా బ్రేకీవెన్ అయినట్లుగా తెలిపారు. (Naa Saami Ranga Collections)

నా సామిరంగ 5వ రోజు కలెక్ట్ చేసిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజామ్- 61L

సీడెడ్- 44L

వైజాగ్- 41L

ఈస్ట్- 34L

వెస్ట్- 17L

కృష్ణ- 19L

గుంటూరు- 24L

నెల్లూరు- 14L

మొత్తం 5వ రోజు కలెక్షన్స్ (AP and TS)- రూ. 2.54 కోట్లు (షేర్)

మొత్తం 5 రోజులకు గానూ వసూళ్లు అయిన కలెక్షన్స్ (AP and TS)- రూ 18.17 కోట్లు (షేర్)

ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల టోటల్ కలెక్షన్స్- రూ. 35.4 కోట్లు (గ్రాస్)


Naa-Saami-Ranga-Movie.jpg

ఇప్పటి వరకు లిమిటెడ్ థియేటర్లలోనే ఉన్న ఈ సినిమాకు.. ప్రస్తుతం థియేటర్లు కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. B, C సెంటర్స్‌లో చాలా చోట్ల ఈ సినిమాకు అదనంగా థియేటర్లు లభించాయని.. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టి.. అన్ని ఏరియాలలో బ్రేకీవెన్‌కి దగ్గరైందని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నామీనన్ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Updated Date - Jan 19 , 2024 | 03:26 PM