మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Eagle: ఈగ‌ల్ రికార్డుల మోత‌.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌ సెల‌బ్రేష‌న్స్‌

ABN, Publish Date - Feb 11 , 2024 | 02:28 PM

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం ‘ఈగల్‌’ ఫిబ్ర‌వరి 9న థియేటర్ల‌లో విడుద‌లై మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఈ క్రమంలో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ టీం సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించింది.

eagle

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ క‌థానాయిక‌లుగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ (People Media Factory)నిర్మించిన‌ తాజా చిత్రం ‘ఈగల్‌’ (Eagle). ఫిబ్ర‌వరి 9న థియేటర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే శ‌ని, ఆదివారాలు క‌లిసి రావ‌డంతో విడుద‌లైన అన్ని ప్రాంతాల‌లో థియేట‌ర్లు హౌజ్‌ఫుల్ అవుతూ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఈ క్రమంలో ర‌వితేజ త‌దుప‌రి చిత్రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ (Mr Bachchan) మూవీ టీం సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించింది.

శుక్ర‌వారం రోజున విడుద‌లైన ఈగ‌ల్ సినిమా రెండు రోజుల్లోనే రూ.20 కోట్ల‌కు పైగా వ‌సూల్లు రాబ‌ట్టి ర‌వితేజ కేరీర్ బెస్ట్ రికార్డు న‌మోదు చేసింది. ఆదివారం కూడా ఉండ‌డంతో క‌లెక్ష‌న్లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది. అయితే ఈ విజ‌యాన్ని ఈ రోజు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ టీం గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. షాక్‌, మిర‌ప‌కాయ్ వంటి చిత్రాల త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ (Harish Shankar) ర‌వితేజ (Ravi Teja) కాంబినేష‌న్‌లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ (Mr Bachchan) రూపొందుతోండ‌గా భాగ్యశ్రీ భోర్స్ (Bhagyasri Bhorse) క‌థానాయిక‌గా న‌టించింది.


అజ‌య్ దేవ‌గ‌ణ్ హిందీ చిత్రం రైడ్ చిత్రానికి రీమేక్‌గా మిస్ట‌ర్‌బ‌చ్చ‌న్ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ (People Media Factory) నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోండ‌గా అ సినిమా సెట్‌లోనే ఈగ‌ల్ (Eagle) చిత్ర స‌క్సెస్ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌వితేజ‌తో పాటు హ‌రీశ్ శంక‌ర్ (Harish Shankar) , హీరోయిన్ భాగ్యశ్రీ (Bhagyasri Bhorse) ,చిత్ర యూనిట్ పాల్గోంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Feb 11 , 2024 | 02:40 PM