Raviteja: మిస్టర్‌ బచ్చన్  కొత్త షెడ్యూల్‌ ఎక్కడంటే! 

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:11 PM

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja), దర్శకుడు హరీష్‌ శంకర్‌ (harish Shankar) మ్యాజికల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌  ‘మిస్టర్‌ బచ్చన్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే!  ‘నామ్‌ తో సునా హోగా’ అన్నది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.

Raviteja: మిస్టర్‌ బచ్చన్  కొత్త షెడ్యూల్‌ ఎక్కడంటే! 

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja), దర్శకుడు హరీష్‌ శంకర్‌ (harish Shankar) మ్యాజికల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌  ‘మిస్టర్‌ బచ్చన్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే!  ‘నామ్‌ తో సునా హోగా’ అన్నది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. తాజాగా దర్శకుడు హరీష్‌ కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్‌ షెడ్యూల్‌ కోసం టీం కరైకుడికి బయలుదేరిందని చిత్ర బృందం తెలిపింది. ఈ షెడ్యూల్‌లో కరైకుడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ చేసిన ట్వీట్‌కు హరీష్‌ శంకర్‌ రిప్లై ఇచ్చారు. మరో ఫన టాస్టిక్‌ షెడ్యూల్‌కి రెడీ అయ్యాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

షాక్‌, మిరపకాయ్‌ చిత్రాల తర్వాత రవితేజ, హరీష్‌ శంకర్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రంలో రవితేజ పూర్తిగా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పనోరమా స్టూడియోస్‌, టి-సిరీస్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.  మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘రైడ్‌’కి రీమేక్‌ అని టాక్‌ నడుస్తోంది. 


Updated Date - Jan 25 , 2024 | 12:18 PM