Harish Shankar: అనుభూతులు, అనుభవాల జ్ఞాపకాల కోసం వేచి చూడండి

ABN , Publish Date - Feb 14 , 2024 | 03:33 PM

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొండుతున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్‌'. 'నామ్ తో సునా హోగా' అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో రవి తేజ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.

Harish Shankar: అనుభూతులు, అనుభవాల జ్ఞాపకాల కోసం వేచి చూడండి

మాస్ మహారాజా రవితేజ,  హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొండుతున్న చిత్రం  'మిస్టర్ బచ్చన్‌'.  'నామ్ తో సునా హోగా' అనేది  ట్యాగ్‌లైన్‌. ఇందులో రవి తేజ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.  భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. వాలంటైన్స్ డే సందర్భంగా బుధవారం ఈ చిత్రం కొత్త లుక్ ను విడుదల చేసారు. రవితేజ, భాగ్యశ్రీ  ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను ఆకట్టుకుంటుంది. 


ఈ మేరకు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ట్వీట్ చేశారు, అనుభూతులు, అనుభవాలను, గుర్తుచేసే ప్రేమ కథ కోసం వేచి చూడండి" అని పేర్కొన్నారు.

మ్యాజికల్ మాస్ కాంబోలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కారైకుడిలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభామ కానుంది. ఈ చిత్రానికి  మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ డీవోపీగా చేస్తున్నారు. 

Updated Date - Feb 14 , 2024 | 03:33 PM