మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MohanBabu: వాటిలో నా పేరు తీసుకురావడం బాధాకరం!

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:29 PM

"ఏ రాజకీయ పార్టీ వారైనా తన పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని సీనియర్‌ నటుడు ఎం.మోహన్ బాబు(Mohanbabu)  విజ్ఞప్తి చేశారు.


"ఏ రాజకీయ పార్టీ వారైనా తన పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని సీనియర్‌ నటుడు ఎం.మోహన్ బాబు(Mohanbabu)  విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో తన పేరును రాజకీయంగా కొందరు వినియోగించుకుంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు  మోహన్ బాబు  ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.



"మనం అనేక రకాల భావాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి వారి వారి అనుబంధం సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ శాంతి సౌభ్రాతృత్వాన్ని వ్యాపింపజేయడంలో అందరూ బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. నా విజ్ఞప్తిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరిస్తున్నాను’’ అని మోహన్ బాబు లేఖలో పేర్కొన్నారు.


Updated Date - Feb 26 , 2024 | 12:29 PM