Manchu Family: మనోజ్‌పై దాడి జరిగిందంటూ రిపోర్ట్..
ABN, Publish Date - Dec 09 , 2024 | 10:39 AM
తనపై దాడి జరిగిందని పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ఫ్రూవ్స్ కోసం మంచు మనోజ్ నిన్న ఆస్పత్రికి వెళ్లినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.
నటుడు మంచు మోహన్‌బాబుకు (Mohan Babu) ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు (Manoj manchu) మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు.. అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీషరీఫ్ పరిధిలోని మోహన్‌బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్‌బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు మనోజ్‌పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరచినట్లు ఆ గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డయల్-100కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కాలుకు గాయం అయిన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. తండ్రితో గొడవ విషయమై మీడియా ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు. (Mohan Babu Vs Manoj)