Mahesh Babu: యూరప్‌ ట్రిప్‌ ఫొటోలు వైరల్‌.. అందులో ఏముందంటే!

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:58 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌కు (Mahesh Babu) సమయం కుదిరితే ఆ టైమ్‌ అంతా కుటుంబంతో గడపడానికే కేటాయిస్తుంటారు. భార్య పిల్లలతో కలిసి విదేశాలకు టూర్‌ వేస్తుంటారు.

Mahesh Babu: యూరప్‌ ట్రిప్‌ ఫొటోలు వైరల్‌.. అందులో ఏముందంటే!
Mahesh babu Europe trip photos

సూపర్‌స్టార్‌ మహేష్‌కు (Mahesh Babu) సమయం కుదిరితే ఆ టైమ్‌ అంతా కుటుంబంతో గడపడానికే కేటాయిస్తుంటారు. భార్య పిల్లలతో కలిసి విదేశాలకు టూర్‌ వేస్తుంటారు. 15 రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌కి (Eerope trip)వెళ్లారు. అయితే ఇప్పటి దాకా ఆ ఫొటోలను అయన ఎక్కడా షేర్‌ చేయలేదు. సితార (Sitara), నమ్రతా శిరోద్కర్‌ (Namratha sirodhkar) మాత్రం ట్రిప్‌ ఫొటోలు ఎప్పటికప్పుడు ఇన్స్టా గ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ ఉన్నారు. దీంతో మహేష్‌ వెకేషన్‌ వైరల్‌గా మారింది. తాజాగా తాజాగా మహేష్  కూడా ఆ ఫొటోలను షేర్‌ చేశారు. 

Maes.jpeg

అయితే ఫ్యామిలీతో కాకుండా అక్కడి ప్రదేశాలను ఎక్కువగా షేర్‌ చేశారు. తన కూతురు సితారతో కలిసి దిగిన ఓ క్యూట్‌ ఫొటో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో మహేష్‌ తన కూతురుని ప్రేమగా హత్తుకొని ఉన్నాడు. అయితే అందులో మహేష్‌ జుట్టు కూడా బాగా పెంచినట్టు కనిపిస్తుంది.ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  సితారతో ఉన్న ఫొటో చూసి బెస్ట్‌ ఫాదర్‌, బెస్ట్‌ డాటర్‌ అని  కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు అభిమానులు. 

Kriti Sanon: కథే అసలైన హీరో..  అదంతా అపోహే..


Updated Date - Apr 12 , 2024 | 01:55 PM