Mahesh - Manjula: అక్కా - తమ్ముడు క్యూట్ వీడియో వైరల్‌!

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:34 PM

మంజుల: ఆ హెయిర్‌ స్టైల్‌ ఏంట్రా? మహేష్‌:  కొత్త స్టైల్‌ అక్కా.. రాజమౌళి సినిమా కోసం పెంచుతున్నా. బావుందా? మంజుల: ఒరేయ్‌ తమ్ముడు.. నవ్వు ఆగట్లేదురా.. (జుత్తు పట్టుకుని) మహేష్‌: అలా నవ్వకే.. చాలా కష్టపడి జుట్టు పెంచాను.. దీని వెనుక ఎంత కష్టం ఉందో నీకు తెలీదు  మంజుల: ఏం కష్టమోగానీ నాకైతే నవ్వు ఆగట్లేదు రా!!

Mahesh - Manjula: అక్కా - తమ్ముడు క్యూట్ వీడియో వైరల్‌!
Mahesh Babu - Manjula

మంజుల: ఆ హెయిర్‌ స్టైల్‌ ఏంట్రా?
మహేష్‌:  కొత్త స్టైల్‌ అక్కా.. రాజమౌళి సినిమా కోసం పెంచుతున్నా. బావుందా? (Mahesh)
మంజుల: ఒరేయ్‌ తమ్ముడు.. నవ్వు ఆగట్లేదురా.. (జుత్తు పట్టుకుని)
మహేష్‌: అలా నవ్వకే.. చాలా కష్టపడి జుట్టు పెంచాను.. దీని వెనుక ఎంత కష్టం ఉందో నీకు తెలీదు (Manjula)
మంజుల: ఏం.. కష్టమోగానీ నాకైతే నవ్వు ఆగట్లేదు రా!!
ఈ వీడియో, అందులో ఎక్స్‌ప్రెషన్స్  చూస్తుంటే మహేష్‌, తన సోదరి మంజులకు మధ్య సంభాషణ ఇలాగే ఉన్నట్లు అనిపిస్తుంది కదూ! తాజాగా ఓ వేడుకలో జరిగిన సరదా సన్నివేశమిది. (mahesh Babu video)

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (SSMb29)కోసం సిద్ధమవుతున్నారు. తాజాగా ఫ్యామిలీ ఫంక్షన్ లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఓ క్యూట్‌ వీడియో నెట్టింట విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా తన గారాలపట్టీ సితారతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు మహేష్‌. ఈ వేడుకకు మహేశ్‌ అక్క మంజుల కూడా వచ్చింది. తమ్ముడు తో సరదాగా సంభాషించింది. కబుర్లు చెబుతూ మహేష్‌ పొడుగు జుత్తును పట్టుకుని సరదాగా మాట్లాడింది. ఆయన కూడా ఏ బాలేదా అన్నట్లు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. మహేష్‌ ఎక్స్‌ప్రెషన్ కి   మంజుల పగలబడి నవ్వారు. అక్క-తమ్ముడు కలిసి సరదాగా కనిపించిన ఈ వీడియో వైరల్‌ అవుతోంది.  

ప్రస్తుతం మహేష్‌ రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్స్‌ పూర్తయ్యాయి. మహేశ్‌ బాబు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల దుబాయ్‌ వెళ్లిన ఆయన అక్కడ స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసి వచ్చారని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన కొత్త లుక్‌లో స్టైలిష్‌ఆ కనిపిస్తున్నారు. 

Updated Date - Apr 29 , 2024 | 12:40 PM