Kajal: అనుమతి లేకుండా వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చి..

ABN , Publish Date - May 21 , 2024 | 05:34 PM

అభిమాన తారలు కనిపిస్తే తమ అభిమానాన్ని పలు రూపాల్లో చూపిస్తుంటారు. ఒక్కో సందర్భంలో హద్దు మీరుతుంటారు. అలాంటి వారి ప్రవర్తన అప్పుడప్పుడూ యాక్టర్లకు కలిగిస్తుంటుంది

Kajal:  అనుమతి లేకుండా వ్యానిటీ వ్యాన్ లోకి వచ్చి..

అభిమాన తారలు కనిపిస్తే తమ అభిమానాన్ని పలు రూపాల్లో చూపిస్తుంటారు. ఒక్కో సందర్భంలో హద్దు మీరుతుంటారు. అలాంటి వారి ప్రవర్తన అప్పుడప్పుడూ యాక్టర్లకు కలిగిస్తుంటుంది. కాజల్‌ అగర్వాల్‌కూ (Kajal) ఎదురైన ఓ సంఘటన గురించి తాజాగా చెప్పుకొచ్చారు. ‘సత్యభామ’ (Satyabhama) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో తాను నటించిన ఓ సినిమా చిత్రీకరణలో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

kajal.jpg‘కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నా. తొలి రోజు చిత్రీకరణ పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనుమతి లేకుండా నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చాడు. చొక్కా విప్పి.. తన ఛాతీపై ఉన్న నా పేరుతో కూడిన టాటూని చూపించాడు. ఎవరూ లేని సమయంలో అతడలా చేయడంతో నేను భయపడ్డా. నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే. కానీ, ఇలా చేయడమే కరెక్ట్‌ కాదని సున్నితంగా హెచ్చరించా’’ అని అన్నారు. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ‘సత్యభామ’లో కాజల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించారు. నవీన్‌ చంద్ర కీలక పాత్ర పోషించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - May 21 , 2024 | 05:38 PM