Family Star- Asha Borra: వాడుకుని వదిలేసేదానికి ఇంతోటి హంగామా ఎందుకు.. టైమ్‌ వేస్ట్‌!

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:59 PM

తనతో డైలాగులు చెప్పించి మరీ, సినిమాలో ఆ సన్నివేశాలు తీసేశారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు ఇన్ ఫ్లూయన్సర్‌ ఆశా బోరా. టిక్‌టాక్‌తో పాపురల్‌ అయ్యి ఇప్పుడు ఇనస్టాగ్రామ్‌ రీల్స్‌తో మరింత క్రేజ్‌ తెచ్చుకున్న ఆశా బొర్రా ఫ్యామిలీ స్టార్‌ చిత్రంలో ఓ పాత్ర పోషించారట.

Family Star- Asha Borra: వాడుకుని వదిలేసేదానికి ఇంతోటి హంగామా ఎందుకు.. టైమ్‌ వేస్ట్‌!
Family Star, Asha borra

తనతో డైలాగులు చెప్పించి మరీ, సినిమాలో ఆ సన్నివేశాలు తీసేశారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు ఇన్ ఫ్లూయన్సర్‌ ఆశా బోరా(Asha borra). టిక్‌టాక్‌తో పాపురల్‌ అయ్యి ఇప్పుడు ఇనస్టాగ్రామ్‌ రీల్స్‌తో మరింత క్రేజ్‌ తెచ్చుకున్న ఆశా బొర్రా 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రంలో ఓ పాత్ర పోషించారట. తీరా సినిమా విడుదలయ్యాక ఆ సన్నివేశాలు కాదు కదా.. ఆమె నటించిన ఒక్క సీన్ కూడా తెరపై కనిపించలేదట. దాంతో సినిమా బృందంపై సోషల్‌ మీడియా వేదికగా పంచాయతీ పెట్టింది ఆశా. "ఇంట్లో ఉన్న నన్ను పిలిచి మరీ స్టఫ్‌లా వాడుకుని వదిలేస్తే  సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ కాకపోతే ఇంకేం అవుతుంది.. సీన్లు, సాంగ్సు, ఫ్యామిలీ ఫంక్షన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ నేనే కనిపించానుగా.. అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేసింది.

Anupama Paramesaran: ఇప్పుడు పరిణితి చెందాను... అందుకే ఇలా!

Asha.jpg

‘ఇంతోటిదానికి నా టైం వేస్ట్‌ చేసి, మీ టైం వేస్ట్‌ చేసుకున్నారు. ఈ పాత్ర నేనే చేయాలంటూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దగ్గరి నుంచి కాస్టింగ్‌ డైరెక్టర్‌ వరకు అందరూ ఫోన్లు చేసి అనవసరంగా హంగామా చేశారు. ఉఫ్‌.. అయినా హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్టులకు కరువొచ్చిందా? లేక సోషల్‌ మీడియా ఫేస్‌లను ఉపయోగించుకోవాలని చేశారో మరి! మా పనులు మానుకొని, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకొచ్చి, ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పిన మాట కోసం షూటింగ్‌కు వచ్చాను. యాంటి బయాటిక్స్‌ వేసుకుని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటే సినిమాలో కనీసం ఒక్క డైలాగ్‌ కూడా లేదు. ఇస్తామన్న రెమ్యునరేషన్‌ ఇవ్వకుండా, ట్రావెలింగ్‌ ఖర్చులు చెల్లించకుండా, హోటల్‌లో బస చేసేందుకు  డబ్బులివ్వకుండా, మాకేంటి సంబంధం అన్నట్లు సరిగా స్పందించనూ లేదు. వాహ్‌.. గ్రేట్‌! కనీసం విజయ్‌ దేవరకొండతో నేను మాట్లాడిన సంభాషణలు ఉంచిన కాస్త సంతృప్తి ఉండేదేమో! మీ ఎడిటింగ్‌ అలా ఉంది. నా కళ్లు తెరిపించినందుకు థ్యాంక్స్‌. ఇలా   ప్రశ్నిస్తే  కాంట్రవర్సీ అని ట్యాగ్‌ లైన్‌ ఇస్తారు.. ఇస్తారేంటి? ఇచ్చేశారు కూడా!’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీస్టార్‌ టీమ్‌పై విమర్శలు వర్షం కురిపించారు ఆశా బోరా. 

Adah sharma: అతనిపై కామెంట్‌ చేయడం కరెక్ట్‌ కాదు.. 

Ruhani Sharma: ఆ బంధం గురించి చెప్పాలని లేదు.. పూర్తిగా నా వ్యక్తిగత విషయం


Updated Date - Apr 07 , 2024 | 02:23 PM