Chiranjeevi: చిరంజీవితో హరీష్‌ శంకర్‌ సినిమా.. అంతా ఓకేనా? 

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:33 PM

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించడంతో నూతన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ప్రస్తుతం ఆయన 156 వ చిత్రం ‘విశ్వంభర’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం కోసం జిమ్‌లో యువకథానాయకుడిలా కసరత్తులు చేస్తున్నారు.

Chiranjeevi: చిరంజీవితో హరీష్‌ శంకర్‌ సినిమా.. అంతా ఓకేనా? 

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించడంతో నూతన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం ఆయన 156 వ చిత్రం ‘విశ్వంభర’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం కోసం జిమ్‌లో యువకథానాయకుడిలా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా ఓ కొత్త సినిమా అంగీకరించారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్‌ను అందించిన హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో  ఆయన ఓ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, సుస్మిత ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్‌ నడుస్తోంది. బీవీఎస్‌ రవి కథను అందించనున్నట్లు, ఈ ప్రాజెక్ట్‌కు చిరంజీవి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో వీళ్లిద్దరి హ్యాష్‌ట్యాగ్‌లు విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.  ప్రస్తుతం హరీశ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగతసింగ్‌’ పనుల్లో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా రానున్న ఈ చిత్రంలో శ్రీలీల  కథానాయిక. దీనితోపాటు రవితేజతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కరైకుడిలో జరుగుతోంది. రవితేజ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు తర్వాత ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు చక్కని స్పందన వచ్చింది. 

Updated Date - Feb 01 , 2024 | 08:33 PM