HANU MAN : UP సీఎం యోగిని క‌లిసిన.. హ‌నుమాన్ చిత్ర బృందం

ABN , Publish Date - Jan 24 , 2024 | 08:35 PM

సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం హ‌నుమాన్‌. ఇప్ప‌టికే సుమూరు రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టి స‌రికొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న‌ది. అయితే తాజాగా ఈ హ‌నుమాన్ చిత్ర బృందం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కి వెళ్లి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను క‌లవ‌డం ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్ అయింది.

HANU MAN : UP సీఎం యోగిని క‌లిసిన.. హ‌నుమాన్ చిత్ర బృందం
hanu man

సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం హ‌నుమాన్‌(Hanu Man). ఇప్ప‌టికే సుమూరు రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టి స‌రికొత్త రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న‌ది. అయోధ్య రామ మందిర ప్రారంభం కూడా ఈ సినిమా ఆప్ర‌తిహ‌తంగా దూసుకుపోవ‌డానికి ఓ కార‌ణ‌మమైంది. అయితే తాజాగా ఈ హ‌నుమాన్ (Hanu Man) చిత్ర బృందం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh)కి వెళ్లి సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi aditya nath)ను క‌లవ‌డం ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్ అయింది.


ఈ భేటీ అనంత‌రం వారు మాట్లాడుతూ సీఎం యోగిని కలవడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నామ‌ని, 'హనుమాన్స‌ (Hanu Man) సినిమాను ఆయన ఎంతగానో ప్రశంసించారని, అలానే ఇలాంటి ఒక ఆఫ్‌బీట్ స్టోరీని సూపర్ హీరో కథనంగా తీర్చిదిద్దిన విధానాన్న ఆయన మెచ్చుకున్నార‌న్నారు. అలానే సినిమాల ద్వారా మన చరిత్రను చూపించడం అవసరమని.. ఇలాంటి చిత్రాలు మరిన్ని తీయాలంటూ మమ్మల్ని ప్రోత్సహించారు." అంటూ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా తెలిపారు. అదేవిధంగా హ‌నుమాన్ చిత్రం యువ‌త‌, చిన్నారుల‌పై చూపించిన ప్ర‌భావం, భార‌త ఇతిహాసాల్లోని అంశాల‌ను సూప‌ర్ హీరోగా ఏ విధంగా తెర‌కెక్కించింది సీఎంకు వివ‌రించిన‌ట్లు ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెలిపారు.

Updated Date - Jan 24 , 2024 | 08:35 PM