అనాధ పిల్లల కోసం... సితార ఏం చేసిందంటే! 

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:28 PM

చీర్స్‌ ఫౌండేషన్సకు చెందిన అనాధ పిల్లల కోసం 'గుంటూరు కారం’ (Guntur kaaram) చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మహేష్‌బాబు(Maheshbabu) ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఎంఎంబీ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ షోకు మహేష్‌ గారాలపట్టీ సితార ఘట్టమనేని (Sitara ghattamaneni)హోస్ట్‌ చేశారు.

అనాధ పిల్లల కోసం... సితార ఏం చేసిందంటే! 

చీర్స్‌ ఫౌండేషన్సకు చెందిన అనాధ పిల్లల కోసం 'గుంటూరు కారం’ (Guntur kaaram) చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మహేష్‌బాబు(Maheshbabu) ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఎంఎంబీ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ షోకు మహేష్‌ గారాలపట్టీ సితార ఘట్టమనేని (Sitara ghattamaneni)హోస్ట్‌ చేశారు. చీర్స్‌ ఫౌండేషన్సకు చెందిని చిన్నారులతో సితార సందడి చేశారు. వారితో కలిసి సినిమా చూసిన అనంతరం సినిమా పట్ల చిన్నారుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సితార ఉదారతకు నెటిజన్లు అభినందిస్తున్నారు.  గతంలో కూడా తన పుట్టినరోజు సందర్భంగా కొందరు చిన్నారులకు సైకిళ్లు అందచేసి తన మంచి మనసును చాటుకుంది సితార.

Gunturkaram  (4).jpg

మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజు నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో దూకుడు ప్రదర్శింస్తోంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ లీల, మీనాక్షి  చౌదరి నాయికలు. 

Gunturkaram  (2).jpgGunturkaram  (1).jpg

Updated Date - Jan 21 , 2024 | 01:28 PM