Ramcharan: చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారానికి గ్లోబ‌ల్ స్టార్‌.. సంబురాల్లో ఫ్యాన్స్

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:49 AM

జూన్ 12న ఏపీలో జ‌ర‌గ‌నున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హ‌జ‌ర‌వ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Ramcharan: చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారానికి గ్లోబ‌ల్ స్టార్‌.. సంబురాల్లో ఫ్యాన్స్
ramcharan

జూన్ 12న ఏపీలో జ‌ర‌గ‌నున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (N Chandrababu Naidu) ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వానికి గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (RamCharan) హ‌జ‌ర‌వ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయ‌న న‌టిస్తున్న‌ 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణ రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో జరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న షూటింగ్‌కు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొన‌న్న‌ట్లు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీ నుంచి, దేశంలోని ఇత‌ర పార్టీల నాయ‌కులు, క్రీడా రంగం నుంచి భారీగానే సెల‌బ్రిటీలు ఈ వేడుక‌లో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ జ‌న‌సేన బీజేపీ కూట‌మి వైఎస్సారీసీపి పార్టీని మ‌ట్టి క‌రిపించి క‌నివినీ ఎరుగ‌ని రీతిలో 164 సీట్లను సాధించి చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (N Chandrababu Naidu) నాలుగోసారి బుధ‌వారం (జూన్ 12)న ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

ram.jpg


ఈ వేడుక కోసం గన్నవరం ఎయిర్ పోర్టు స‌మీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులోని సుమారు 11 ఎకరాలు స్థలంలో వేదిక‌ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రితో పాటు కూట‌మిలోని కొంత‌మంది ఎమ్మెల్యేలు క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ వేడుక‌కు రామ్ చ‌ర‌ణ్ (RamCharan) హ‌జ‌ర‌వ‌నున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో అయ‌న ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. భారీ క‌టౌట్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 10:54 AM