Dheera: ‘ధీర’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:54 PM

‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఇప్పుడు ‘ధీర’ అంటూ మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. లక్ష్ సరసన సోనియా భన్సాల్, నేహా పఠాన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సెన్సార్ నుండి ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికేట్ జారీ అయింది.

Dheera: ‘ధీర’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?
Dheera Movie Still

‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడ (Laksh Chadalavada) తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఇప్పుడు ‘ధీర’ (Dheera) అంటూ మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. లక్ష్ సరసన సోనియా భన్సాల్, నేహా పఠాన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ వంటివన్నీ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మంచి క్రేజ్‌ని ఏర్పరచాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన, బెక్కెం వేణుగోపాల్ వంటి వారు.. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని చెప్పడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నైజాం, వైజాగ్‌లలో విడుదల చేయడం కూడా సినిమాపై ఇంట్రస్ట్‌ని కలిగిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. అన్ని రకాలుగా విడుదలకు సిద్ధమైంది. (Dheera Ready to Release)


Dheera.jpg

సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యుబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు, సినిమా చాలా బాగుందని, సరికొత్త ప్రయత్నమని, సరైన మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ ఇదని ప్రశంసించినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా.. ప్రేక్షకుల చేత కూడా శభాష్ అనిపించుకుంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌‌పై పద్మావతి చదలవాడ ఈ సినిమాను నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి వంటివారు ఇతర పాత్రలలో నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

**************************

*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

***************************

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

Updated Date - Feb 01 , 2024 | 08:54 PM