ధనుష్, శేఖర్ కమ్ముల, నాగార్జున సినిమా మొదలైంది...

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:32 PM

తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి ధనుష్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం అయింది. ఇందులో నాగార్జున ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ధనుష్, శేఖర్ కమ్ముల, నాగార్జున సినిమా మొదలైంది...
Dhanush, Sekhar Kammula film starts shooting

చాలామంది దర్శకులు అగ్ర నటులతో పనిచేస్తూ, పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తూ పేరు తెచ్చుకుంటారు, కానీ చిన్న బడ్జెట్ తో సృజనాత్మకమైన సినిమాలు తీసి అగ్ర దర్శకులతో సమానంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎవరైనా వున్నారు అంటే, అది ఒక్క శేఖర్ కమ్ముల మాత్రమే. అతను తీసిన ప్రతి సినిమాలోనో ఒక మంచి సందేశం ఉంటుంది, వినోదం ఉంటుంది, అలాగే తెలుగుదనం ఉంటుంది. తాను రాసుకున్న కథలకి వెండితెర మీద ఒక రూపం కల్పించి, ప్రేక్షకుల మదిలో కలకాలం ఉండేట్టు చిత్రాలు తీయగల దిట్ట శేఖర్ కమ్ముల. (Sekhar Kammula and Dhanush combination film starts shooting today)

dhanushfilmsunilnarang.jpg

అటువంటి శేఖర్ కమ్ముల ఇప్పుడు తమిళ నటుడు ధనుష్ (Dhanush) తో సినిమా చేస్తున్నారు. దీనికి సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావులు నిర్మాతలుగా వున్నారు. తెలుగు అగ్ర నటుల్లో ఒకరైన నాగార్జున ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు మొద‌లైంది. ఈ మధ్యనే 'యానిమల్' లో నటించి, సంచలనం సృష్టించి నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో కథానాయిక. (Nagarjuna is playing an important role in Dhanush and Sekhar Kammula film)

dhanushsekhar.jpg

ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలవుతోంది. ఇది దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్ లో ఒక మైలురాయి గా నిలబడే సినిమా. ఇంతకు ముందు నిర్మాత సునీల్ నారంగ్ తో 'లవ్ స్టోరీ' సినిమా చేశారు శేఖర్ కమ్ముల, అందులో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఆ సినిమా పాండమిక్ తరువాత విడుదలై ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అదే నిర్మాతలతో మళ్ళీ జతకట్టి ఈ ధనుష్ సినిమా చేస్తున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 07:01 PM