40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhanush 51: ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల షూటింగ్‌తో శ్రీవారి భక్తులకు ఇబ్బంది! 

ABN, Publish Date - Jan 30 , 2024 | 12:06 PM

తిరుపతి, అలిపిరి ప్రాంతంలో శ్రీవారి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో నాగార్జున, ధనుష్‌ (Dhanush 51) కలిసి నటిస్తోన్న చిత్రం షూటింగ్‌ తిరుపతిలో జరుగుతోంది. మంగళవారం నుంచి రెండురోజుల పాటు తిరుపతి, టీటీడీ ప్రాంగణాల్లో చిత్రీకరణకు పోలీసులు అనుమతించారు.

తిరుపతి, అలిపిరి ప్రాంతంలో శ్రీవారి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో నాగార్జున, ధనుష్‌ (Dhanush 51) కలిసి నటిస్తోన్న చిత్రం షూటింగ్‌ తిరుపతిలో జరుగుతోంది. మంగళవారం నుంచి రెండురోజుల పాటు తిరుపతి, టీటీడీ ప్రాంగణాల్లో చిత్రీకరణకు పోలీసులు అనుమతించారు. అలిపిరిలోపాటు నంది సర్కిల్‌, గోవిందరాజు స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు. రేపు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు షూటింగ్‌కు పోలీసులు అనుమతించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టకూడదని, పోలీసు సిబ్బందిని బందో బస్తుకు ఇవ్వలేమని అనుమతుల్లో పోలీసులు పేర్కొన్నారు.

అయినా నిబంధనలు ఉల్లంఘించి మంగళవారం ఉదయం నుంచి అలిపిరి వద్ద షూటింగ్‌ నిర్వహిస్తూ భక్తులకు అంక్షలు చెబుతున్నారు. హీరో సిబ్బంది, బౌన్సర్‌లు భక్తులతో దురుసుగా ప్రవర్తించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కపిల్‌ తీర్థం ద్వారా తిరుమలకు వెళ్లాల్సిన వాహనాలన్నిటి దారి మళ్లించారు. ఇరుకైన హరే రామ హరే కృష్ణ రోడ్‌లో ట్రాఫిక్‌ డైవర్ట్‌ చేయడంతో రోడ్డు మొత్తం జామ్‌ అయింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులను ఆపి షూటింగ్‌కు అనుమతించడంపై భక్తులు మండిపడుతున్నారు. పోలీసులు అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా స్వామి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆటలాడుతున్నారనీ, దుర్భషలాడుతున్న బౌన్సర్‌లకు మద్దతుగా ఉన్నారని మండిపడుతున్నారు. 

శేఖర్‌ కమ్ముల హీరోగా నాగార్జున, ధనుష్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. పూస్కూర్‌ రామ్మోహనరావు, సునీల్‌ నారంగ్‌ నిర్మాతలు. 


Updated Date - Jan 30 , 2024 | 12:52 PM