GMB Entertainments Alert: నకిలీ ఖాతాలతో సైబర్ మోసాలు

ABN , Publish Date - Feb 10 , 2024 | 10:34 AM

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. సితార ఘట్టమనేని పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులు పలువురికి పంపుతున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ గుర్తించింది

GMB Entertainments Alert: నకిలీ ఖాతాలతో  సైబర్ మోసాలు

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) కుమార్తె సితార (Sitara) పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. సితార ఘట్టమనేని పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులు పలువురికి పంపుతున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ గుర్తించింది. ఇటువంటి వాటిని  నమ్మొద్దని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా  పేర్కొంది. దీనికి సంబంధించి మాదాపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీల పేరుతో ఇలాంటి లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ సంస్థ సూచించింది. 

Untitled-1.jpg

సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఆమె సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు తన తండ్రి పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా గుంటూరు కారం చిత్రం నుంచి దమ్‌ మసాలా సాంగ్‌తో అలరించింది. 



Updated Date - Feb 10 , 2024 | 10:37 AM