Prasanth Varma: ఇక తేజ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలను

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:53 PM

'హనుమాన్‌’ చిత్రం గురించి ఓ వేదికపై మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడిన మాటలకు దర్శకుడు ప్రశాంత్ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు.

Prasanth Varma: ఇక తేజ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలను
Chiranjeevi-Hanuman

'హనుమాన్‌’ (Hanuman)చిత్రం గురించి ఓ వేదికపై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మాట్లాడిన మాటలకు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) భావోద్వేగానికి లోనయ్యారు.  తేజ సజ్జా (Teja Sajja) నటించిన ఈ చిత్రం చూశాక తానెంతో సంతృప్తి చెందానని ఇటీవల చిరంజీవి అన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని మార్చి నెలలో నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తారు? అని చిరును ప్రశ్నించగా ‘‘మీరు అక్కడ కూర్చొన్న వ్యక్తి (తేజ సజ్జ వైపు చూపిస్తూ..)ని చూశారా.? అతను 'హను-మాన్‌’ చేశాడు. అదే పేరుతో నేను ఒక సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. ఈ సినిమా చూశాక నాకు చాలా సంతృప్తి అనిపించింది. నేను తనని వేరుగా చూడటం లేదు. అతను నా ప్రయాణంలో ఒక భాగం. నేను నటించిన చూడాలని వుంది, ఇంద్ర చిత్రాల్లో నటించాడు. నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్‌ భారతదేశం అతడి నటనను మెచ్చుకుంటోంది’’ అని చిరంజీవి బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా విడుదలైంది.

Ram Charan: చెన్నైలో గ్లోబ‌ల్ స్టార్‌.. కాసేప‌ట్లో డాక్ట‌రేట్ అందుకోనున్న రామ్‌చ‌ర‌ణ్‌


చిరు వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘హనుమంతుడి కథ నేపథ్యంలో సినిమా చేయడం పద్మవిభూషణ్‌ చిరంజీవికి డ్రీమ్‌ అని విని ఎంతో సంతోషంగా అనిపించింది. ఆయన మాటలు నాపై మరింత బాధ్యత పెంచాయి. ఈ క్షణాలను  ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆగలేదు. తేజ ఇప్పుడు ఏవిధంగా ఫీల్‌ అవుతున్నాడో ఊహించగలను’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన 'హనుమాన్'కు  సీక్వెల్‌గా జై హనుమాన్  సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి భాగాన్ని మంచి గ్రాండ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని తెలిపారు.

Updated Date - Apr 13 , 2024 | 03:56 PM