Allu Arjun: 'పుష్పరాజ్'కు బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు!

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:33 PM

పాన్  ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.

Allu Arjun:  'పుష్పరాజ్'కు  బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు!


పాన్  ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2’ (Pushpa2). ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ (Anil sharma) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల టీజర్‌ వీక్షించిన ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా. గతేడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన ‘గదర్‌ 2’ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కానున్న ‘పుష్ప 2’ సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ, చిత్ర బృందానికి నా అభినందనలు పుష్పరాజ్‌గా బన్నీ లుక్‌ నటన అత్యద్భుతంగా ఉంది.’’ అని అన్నారు. దీనిపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (allu arjun)

Janhvi Kapoor: ఎందుకు.. ఎవరికోసమంటే..!

పాన్  ఇండియా స్థాయిలో హిట్‌ అయిన 'పుష్ప: ది రైజ్‌’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌ ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా కనిపించారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయని చిత్ర బృందం చెబుతున్నారు. 

Updated Date - Apr 15 , 2024 | 05:42 PM