Janhvi Kapoor: ఎందుకు.. ఎవరికోసమంటే..!

ABN , Publish Date - Apr 15 , 2024 | 04:43 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక వివాహం జులైలో జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా రాధిక కోసం జాన్వీకపూర్‌ స్పెషల్‌ పార్టీ నిర్వహించారు.

Janhvi Kapoor: ఎందుకు.. ఎవరికోసమంటే..!
Janhvey kapoor

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక (Radhika Merchant) వివాహం జులైలో జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన  ప్రీ వెడ్డింగ్‌ వేడుక సినీ, రాజకీయ తారలు నడుమ గుజరాత్ లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా రాధిక కోసం 'ప్రిన్సెస్ డైరీస్' పేరుతో జాన్వీకపూర్‌ (Janhvey kapoor) స్పెషల్‌ పార్టీ నిర్వహించారు. స్నేహితులతో కలిసి బ్యాచులరేట్‌ పార్టీ (bachelorette party) ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రాధిక వైట్‌ డ్రెస్‌లో మెరవగా, మిగిలిన అతిథులంతా గులాబీ రంగు డ్రెస్‌ కోడ్‌లో సందడి చేశారు.

Parineeti Chopra: ఆ ప్రేమకు గుండె నిండిపోయింది.. ఊహాగానాలకు చెక్‌!


రకరకాల ఆటలు, డిన్నర్‌ పార్టీతో  సరదాగా ఈ వేడుక నిర్వహించారు జాన్వీ. కాబోయే వరుడు అనంత్‌, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, జాన్వీ స్నేహితుడు  శిఖర్‌ పహరియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ తాజాగా ఇన్స్టాలో షేర్‌ చేశారు. తమకెంతో ప్రత్యేకమైన పెళ్లి కుమార్తె కోసం ఈ పార్టీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జాన్వీకపూర్‌ చెప్పారు.

Updated Date - Apr 15 , 2024 | 04:46 PM