Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు.. నిందితులు దొరికారు

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:37 AM

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman khan)ఇంటి ముందు ఈ నెల 14న కాల్పులు జరిపిన నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు.. నిందితులు దొరికారు
Salman khan


బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman khan)ఇంటి ముందు ఈ నెల 14న కాల్పులు జరిపిన నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్‌ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్ద ఇద్దరు దుండగులు (Two shooters) ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్‌ సైకిల్‌ మీద పారిపోయిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్వాప్తులో వేగం పెంచారు. ఈ  ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్‌ పాల్‌ (21) నిందితులుగా గుర్తించారు. ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Salman-2.jpg

షూటర్లు ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారని పోలీసులు అధికారులు తెలిపారు. గతంలో వారిద్దరిపై ఇప్పటికే చైన్‌ స్నాచింగ్‌, దొంగతనం వంటి కేసులు ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్‌ 14న కాల్పులు జరిగిన తర్వాత సల్మాన్‌ ఖాన్‌ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పదికి పైగా టీమ్‌లుగా విడిపోయి కేసును ఛేదించారు. నిందితులను విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. (Bollywood)

Shankar: ద‌ర్శ‌కుడు శంకర్‌ కూతురు ద్వితీయ వివాహం.. త‌ర‌లొచ్చిన‌ తారాలోకం


Updated Date - Apr 16 , 2024 | 10:53 AM