Nani: వాటికి  కాస్త గ్యాప్ ఇవ్వమని నరేష్ కి నేనే చెప్పా  

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:09 PM

అల్లరి నరేష్  కథానాయకుడిగా నటిస్తున్న  ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది

Nani: వాటికి  కాస్త గ్యాప్ ఇవ్వమని నరేష్ కి నేనే చెప్పా  
Aa Okkati Adakku trailer launch

అల్లరి నరేష్(allari Naresh)  కథానాయకుడిగా నటిస్తున్న  ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). మల్లి అంకం (malli ankam) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సోమవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమవుతాయి. అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, రిలేషన్ ని నెక్స్ట్ లెవల్  తీసుకెళ్లడానికి వారికి సమస్య ఉంది.ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో దర్శకుడు మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పారు. కామెడీ సీక్వెన్స్‌లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. ఆమె పాత్రలో చక్కగా అలరించారు. వెన్నెల కిషోర్,  వైవా హర్షల ప్రజెంట్ తగిన వినోదాన్ని అందిస్తుంది. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం  నాని మాట్లాడుతూ "నరేష్ ఇలాంటి వేడుకలకు రమ్మని సాధారణంగా నన్ను అడగరు. అడిగారంటేనే ఈ సినిమా తన మనసుకు ఎంత దగ్గరైయిందో అర్ధమౌతుంది.  'ఆ ఒక్కటీ అడక్కు'.. నరేష్ నాన్న గారు డైరెక్ట్ చేసిన టైటిల్ వాడటం వలన స్పెషల్ కనెక్షన్ వుందని అనుకుంటున్నాను. నరేష్ అద్భుతమైన నటుడు. తను బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేనే కోరాను. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్ లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఇందులో పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా వుంది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతున్నాను. ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. మే 3న నరేష్ తో కలసి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. 'ఆ ఒక్కటీ అడక్కు'తనని మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఈవీవీ గారి ఆశీర్వాదం కూడా టీం అందరికీ వుంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు

అల్లరి నరేష్ మాట్లాడుతూ "ఆ ఒక్కటీ అడక్కు' టీం ఎఫర్ట్. రవి గారి మాటలు మల్లి గారి డైరెక్షన్, సూర్య గారి కెమరా వర్క్, చోటా గారి ఎడిటింగ్, నిర్మాత రాజీవ్ గారు.. అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నాను. ఖచ్చితంగా  ఈ సమ్మర్ లో మిమ్మ్మల్ని బాగా నవ్విస్తాను. ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్తాను. తప్పకుండా ఈ సినిమా మే3న చూడండి' అని అన్నారు. 

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. 'ఆ ఒక్కటీ అడక్కు' బ్యూటీఫుల్ స్టొరీ, కాన్సెప్ట్. ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ది. మీరంతా చిట్టి చిట్టి అని పిలుస్తారు. సిద్ది అని పిలిచినా బావుటుంది.( నవ్వుతూ). నాని గారు సపోర్ట్ చేయడానికి రావడం చాలా స్ఫూర్తిని ఇచ్చింది' అన్నారు.  

Updated Date - Apr 23 , 2024 | 08:59 AM