Naren Ram: ఇది థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా..

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:23 PM

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. ఓ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి. ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. మార్చి 29న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా విశేషాలను.. ఇందులో నటించిన నటుడు నరేన్ రామ్ మీడియాకు తెలియజేశారు.

Naren Ram: ఇది థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా..
Actor Naren Ram

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). ఓ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి. ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. మార్చి 29న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా విశేషాలను.. ఇందులో నటించిన నటుడు నరేన్ రామ్ (Naren Ram) మీడియాకు తెలియజేశారు. నరేన్ రామ్ సీనియర్ నటుడు గుమ్మడి (Gummadi)కి బంధువు. గుమ్మడి.. నరేన్‌కి తాతయ్య వరుస అవుతారు. అలా మొదటి నుండి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. తెలుగు వారైన నరేన్ తల్లితండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ తమిళ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పలు యాడ్స్, సినిమాలు చేసిన నరేన్ తమిళ్‌లో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్‌గా చేశారు. తెలుగులో ‘కలియుగం పట్టణంలో’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేశారు నరేన్ రామ్. ‘కలియుగం పట్టణంలో’ విశేషాలను తెలుపుతూ..

‘‘నేను ఛాన్సుల కోసం వెతుకుతుండగా ఈ సినిమా కో డైరెక్టర్, నా మంచి కోరే సాయి అన్న నన్ను పిలిచి ఈ ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చేశారు. ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది. నాకు కథ నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను. డైరెక్టర్ గారు చాలా కూల్, తనకి కావాల్సినట్టుగా నాకు చెప్పి చేయించుకున్నారు. ఆయనతో ఇంకా వర్క్ చేయాలని ఉంది. హీరో విశ్వ కార్తికేయ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాడు. హీరోగా చేస్తున్నాడు. నాకు వర్క్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. సెట్‌లో మేమిద్దరం డిస్కస్ చేసుకొని యాక్ట్ చేసేవాళ్ళము. మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హీరోయిన్ ఆయూషీ మంచి అమ్మాయి. తనతో ఎక్కువ ర్యాపో లేదు కానీ.. కలిసినప్పుడు కూల్‌గా మాట్లాడతారు. (Naren Ram About Kaliyugam Pattanamlo)


Naren-Ram-2.jpg

నిర్మాతలు నాని, మహేష్‌లు కూడా బాగా క్లోజ్ అయ్యారు. బ్రదర్‌లా ఉండేవారు. కెమెరామెన్ చరణ్ నన్ను చాలా బాగా చూపించారు. సినిమాలో నాకు టైటిల్ సాంగ్, అమ్మ సాంగ్ బాగా నచ్చాయి. అజయ్ మంచి సంగీతం ఇచ్చారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ, అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా. మార్చి 29న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్‌తో సినిమాకు మంచి బజ్ వచ్చింది. సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్పండి. అందరికి రీచ్ అవుతుంది. మేజర్ సిటీలలో కాలేజీ టూర్స్‌కి వెళ్ళాము. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది.. అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాం.

ఈ సినిమా షూటింగ్ కోసం నేను ఫస్ట్ టైం కడపకు వెళ్ళాను. కడపలోనే చాలా వరకు షూట్ జరిగింది. సినిమాల్లో కడప అంటే ఫ్యాక్షన్ అలా చూపించారు, కానీ అక్కడ చాలా పీస్ ఫుల్‌గా ఉంది. అక్కడి ప్రజలు కూడా మంచి సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సినిమా తర్వాత.. త్వరలో తెలుగులో WHO అనే సినిమాతో రాబోతున్నాను. తమిళ్‌లో కొన్ని సినిమాలకు సైన్ చేసి ఉన్నాను..’’ అని నరేన్ రామ్ తెలిపారు. (Actor Naren Ram)


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..

******************************

*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..

**************************

*Bade Miyan Chote Miyan: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

*******************************

Updated Date - Mar 25 , 2024 | 07:23 PM