scorecardresearch

Vijay Sethupathi - Vignesh: మా ఇద్దరి విషయంలో అదే జరిగింది.. ఇప్పుడు మంచి స్నేహితులం!

ABN , Publish Date - Jun 15 , 2024 | 08:39 PM

'ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Devarakonda). తాజాగా ‘మహారాజ’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.  

 Vijay Sethupathi - Vignesh: మా ఇద్దరి విషయంలో అదే జరిగింది.. ఇప్పుడు మంచి స్నేహితులం!

'ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Devarakonda). తాజాగా ‘మహారాజ’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.  ప్రస్తుతం ఆయన వరుస  ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో (Vignesh Shivan) జరిగిన గొడవ పై స్పందించారు.  

"ఏ నటుడికైనా దర్శకుడితో విభేదాలు సర్వసాధారణం. నాకు, విష్నేష్‌కు కూడా అలాగే జరిగింది. ‘నానుమ్‌ రౌడీ థాన్‌’(నేను రౌడీ) తొలిరోజు షూటింగ్‌ తర్వాత విఘ్నేశ్‌కు ఫోన్‌ చేసి గొడవ పడ్డాను. ‘నువ్వు నాకు నటన నేర్పుతున్నావా.. నేను చేసేది నీకు అర్థం కావడం లేదు’ అని గట్టిగా అరిచాను. నాలుగు రోజుల తర్వాత నయనతార మా ఇద్దరితో మాట్లాడి నచ్చచెప్పింది. విక్కీ ఆ స్క్రిప్ట్ చెప్పినపుడు  కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. షూటింగ్‌ ప్రారంభమయ్యాక ఆయన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు మంచి స్నేహితులమయ్యాం. ఆ సినిమాలో నా పాత్ర తెలుసుకోవడానికి నాలుగు రోజులు పట్టింది. అందులో కొన్ని సన్నివేశాల్లో చేసేటప్పుడు అభద్రతా భావానికి లోనయ్యాను. విఘ్నేశ్‌ ప్రతిభ ఉన్న దర్శకుడు ఎవరూ టచ్‌ చేయని కథలను గొప్పగా తీయగలరు. అతనిపై నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టిస్తాడు’ అని క్లారిటీ ఇచ్చారు విజయ్‌ సేతుపతి.

Vignesh.avif

‘మహారాజ’పై కీర్తి సురేశ్‌ ప్రశంసలు
నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నటించిన మహారాజపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటి కీర్తి సురేశ్‌ ఈ చిత్రంపై పోస్ట్‌ పెట్టారు. తమిళ ఇండస్ట్రీలో మహారాజ ఓ అద్భుతమన్నారు. విజయ్‌ సేతుపతి  50వ సినిమా ట్రేడ్‌ మార్క్‌గా నిలిచిపోతుందని.. స్క్రీన్ ప్లే  బాగుందని రాసుకొచ్చారు. 

Updated Date - Jun 15 , 2024 | 08:39 PM