Sunaina Khalid Al Ameri: అర‌బ్ షేక్‌ను.. పెళ్లి చేసుకుంటున్న తెలుగు న‌టి! వైర‌ల్ న్యూస్‌

ABN , Publish Date - Jul 01 , 2024 | 09:19 PM

తెలుగు, త‌మిళ న‌టి త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. ఈస్ట్ ఏసియా ఫేమ‌స్ యూట్యూబ‌ర్ ఖ‌లీద్ అల్ అమెరీని వావాహం చేసుకోనుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వార్త‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.

Sunaina Khalid Al Ameri: అర‌బ్ షేక్‌ను.. పెళ్లి చేసుకుంటున్న తెలుగు న‌టి! వైర‌ల్ న్యూస్‌
sunaina

సౌత్‌ సినిమా ఇండ‌స్ట్రీలో ఓ వైపు విడాకుల కేసుల హాడావుడి న‌డుస్తుండ‌గా పెళ్లిల హంగామా కూడా అదే రేంజ్‌లో న‌డుస్తోంది. ఆ మ‌ధ్య జీవీ ప్ర‌కాశ్‌, ధ‌నుష్‌, కన్న‌డ నాట ద‌ర్ష‌న్‌, యువ రాజ్‌కుమార్ డైవోర్స్ హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత అమ‌లా పాల్, రాధ కుమార్తె కార్తీక‌, వ‌రుణ్ లావ‌ణ్య జంట ఇలా ఆరేడుగురు సినీ తార‌లు వివాహాలు చేసుకుని సెటిల్ అవ‌గా తాజాగా ఆ లిస్టులో తెలుగు, త‌మిళ న‌టి సున‌య‌న (Sunaina) చేరింది. పైగా కొద్ది రోజులుగా త‌న పెళ్లి విష‌యంలో జ‌రుగుతున్న ఊహాగానాల‌కు చెక్ పెట్టింది. ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్లు క్లారిటీ ఇచ్చింది.

GRZVbzjbQAAdl9o.jpeg

కొద్ది రోజుల‌ క్రితం సున‌య‌న త‌న చేతిని ఒక‌రు ప‌ట్టుకుని ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌గా ముద్దుగుమ్మ పెళ్లికి సిద్ద మైందంటూ న్యూస్ కూడా హాల్చ‌ల్ అయింది. అయితే అబ్బాయి వివ‌రాలు బ‌య‌టికి రాలేదు. తాజాగా వారం రోజుల క్రితం ఇన్ స్టాలో షేర్ చేసిన త‌న ఫొటోకు వ‌చ్చిన ఓ కామెంట్ ఆధారంగా అ పెళ్లి కొడుకు ఎవ‌రో నెటిజ‌న్లు బ‌య‌ట పెట్టేశారు. అలాంటి ఫొటోనే అత‌ను త‌న ఇన్‌స్టాలో పోస్టు చేయ‌డం అందులో ఒక‌రికొక‌రు డైమండ్ రింగ్స్ ధ‌రించి ఉండ‌డంతో ఎంగేజ్‌మెంట్ అయింద‌ని అత‌ను మ‌రేవ‌రో కాదు ఫేమ‌స్ యూట్యూబ‌ర్ ఖ‌లీద్ అల్ అమెరీ (Khalid Al Ameri) అని తేల్చేసాయి.

F3z8lDWXIAAWqDx.jpeg


ఇదిలాఉండ‌గా సౌదీకి చెందిన ఖ‌లీద్ అల్ అమెరీకి ఇప్ప‌టికే పెళ్ల‌వ్వ‌గా ఇద్ద‌రు పిల్లు కూడా ఉండ‌గా గ‌త జూలైలో త‌న భార్య‌తో విడాకులు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. కాగా సోష‌ల్ మీడియాలో ఖ‌లీద్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య‌ మిలియ‌న్ల‌లో ఉన్నారు.

GJgCR9pWQAAHJMZ.jpeg

రీసెంట్‌గా మ‌ళ‌యాళ మెగాస్టార్ మ‌మ్మ‌ట్టి న‌టించిన ట‌ర్బో చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా మ‌మ్ముట్టిని ఇంట‌ర్వ్యూ చేసి ఇంకా బాగా ఫేమ‌స్ అయ్యాడు. అయితే వారం రోజుల క్రింద‌టే బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా త‌న ప్రియుడు జ‌హీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోగా అది మ‌రువ‌క ముందే ఇప్పుడు సున‌య‌న కూడా అదేబాట‌లో న‌డుస్తూ ఖ‌లీద్‌ను వివాహం చేసుకోబోతుండ‌డం కాస్త చ‌ర్చ‌నీయాంశం అయ్యే అవ‌కాశం ఉంది.

GLbNRR7WsAATkg1.jpeg

2005లో కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అచ్చ తెలుగు అందం ఆ త‌ర్వాత ఇక్క‌డ‌ రెండు,మూడు తెలుగు చిత్రాలు చేసిన స‌రైన గుర్తింపు ద‌క్క‌క త‌మిళంలోకి వెళ్లి క్ర‌మక్ర‌మంగా పేరు తెచ్చుకుంది. ఆపై అడ‌ప‌ద‌డ‌పా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ వ‌చ్చింది. చివ‌ర‌గా శ్రీ విష్ణు హీరోగా వ‌చ్చిన రాజ రాజ చోర అనే తెలుగు స్ట్రేయిట్ చిత్రంలో న‌టించగా నాని మీట్ క్యూట్‌, చ‌ద‌రంగం వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టించింది. రీసెంట్‌గా రెజీనా అనే త‌మిళ చిత్రం, ఇన్ స్పెక్ట‌ర్ రిషి సిరీస్‌లతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Updated Date - Jul 01 , 2024 | 09:21 PM