Vijay Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుకి స్టార్ హీరో పేరు.. ఎందుకంటే
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:40 PM
విజయ్ సేతుపతి తన కుమారుడికి ఓ స్టార్ హీరో పేరు పెట్టుకున్నారు. అదంతా స్నేహం కోసమే అంటున్నారు..
‘ఉప్పెన’లో హీరోయిన్ తండ్రి రాయణం పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupathi). నటనలో దేశం గర్వించదగ్గ అతికొద్ది మంది విలక్షణ నటులలో ఆయన ఒకరు. భాషలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆయన దూసుకుపోతున్నారు. ఇదంతా పక్కనపెడితే ఆయన కుమారుడి పేరు 'సూర్య' ఈ పేరు వెనుకాల పెద్ద కథే ఉంది.
విజయ్ సేతుపతి దుబాయిలో జాబ్ చేస్తున్నపుడు తన భార్య జెస్సీ సేతుపతిని ఆన్‌లైన్ మొదటి సారి కలిశారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఆయన 2003లో దుబాయ్ నుండి ఇండియాకి షిఫ్ట్ అయ్యారు. వారికి కొడుకు సూర్య, కూతురు శ్రీజ ఇద్దరు సంతానం. కొడుకుకి సూర్య అని తన బెస్ట్ ఫ్రెండ్ పేరు పెట్టుకున్నాడు విజయ్. సేతుపతి బాల్య మిత్రుడు సూర్య. అయితే సూర్య అనారోగ్య కారణాలతో మరణించాడు. దీంతో విజయ్ స్నేహితుడి గుర్తుగా కొడుకుకి సూర్య అని పేరు పెట్టారు. అతని వివాహం తర్వాత దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర ప్రోత్సాహంతో నటనను కంటిన్యూ చేశారు.
విజయ్ సేతుపతి ‘విడుదల 2’తో మరోసారి తెలుగు ప్రేక్షకులును పలకరించనున్నారు. విజయ్ సేతుపతి, సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో మంజూ వారియర్ కీలక పాత్రలో కనిపిస్తోంది. ిఈ సినిమా ఈ నెల 20న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయ్, మంజు వారియర్ ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు.