Lal Salaam: రజినీకాంత్ సినిమా విడుదలవుతోందా, మరి టాక్ లేదేంటి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:43 PM

రజినీకాంత్ 'లాల్ సలాం' సినిమా తెలుగులో ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ప్రత్యేక పాత్రలో మాత్రమే కనపడతారు అని టాక్, అందుకేనేమో ఈ సినిమాకి అసలు బజ్ లేదని అంటున్నారు.

Lal Salaam: రజినీకాంత్ సినిమా విడుదలవుతోందా, మరి టాక్ లేదేంటి
Rajinikanth from Lal Salaam

రజినీకాంత్ ఒక్క తమిళంలోనే కాదు ప్రపంచంలో చాలామంది అభిమానులు అతనికి వున్నారు. అతని సినిమా విడుదలవుతోంది అంటే ఆ సినిమా కోసం ఎదురు చూసే రజిని అభిమానులు వేలకొద్దీ వుంటారు. అలాంటి రజనీకాంత్ సినిమా 'లాల్ సలాం' ఎల్లుండి, అంటే ఇంకో రెండు రోజుల్లో ఫిబ్రవరి 9న తెలుగులో విడుదలవుతోంది. తమిళంతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా విడుదలవుతోంది అంటే మరి ఎంత బజ్ ఉండాలి, ఎంత హంగామా ఉండాలి. కానీ తెలుగులో అసలు విడుదలవుతున్నట్టే ఎవరికీ తెలియదు అంటే ఆ సినిమా ప్రచారాలు ఎంత తక్కువలో ఉన్నాయో అని ఒక టాక్ నడుస్తోంది.

ఈ ఫిబ్రవరి 9 న రవితేజ సినిమా 'ఈగల్' కూడా విడుదలవుతోంది. దీనికి కూడా అంతంత మాత్రంగానే వున్నా, రజినీకాంత్ నటించిన 'లాల్ సలాం' కి మాత్రం బుక్ మై షో లో ఈరోజుకి ఎక్కువ థియేటర్స్ చూపించడం లేదు, అలాగే ఓపెనింగ్స్ కూడా పెద్దగా కనిపించడం లేదు. అంటే ఈ సినిమా విడుదలవుతున్నట్టు కూడా తెలియదేమో, ఎందుకంటే ప్రచారాలు అంతగా లేవు అని ఒక చర్చ నడుస్తోంది.

rajinikanthaishwarya.jpg

అదీ కాకుండా 'లాల్ సలాం' లో రజినీకాంత్ కేవలం ప్రత్యేక పాత్రలో మాత్రమే కనపడతారు అని అతని అభిమానులు అందుకే ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించటం లేదని ఇంకో టాక్ కూడా నడుస్తోంది. అదీ కాకుండా ఫిబ్రవరి నెల అనగానే మామూలుగానే ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్స్ కి రావటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇంట్లో విద్యార్ధులు ఈ సమయాన్ని ఎక్కువగా పరీక్షలకి ప్రిపేర్ అవడానికి సరిపోతుంది.

ఈ సినిమాకి రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం చేశారు. రజినీకాంత్ ముందు సినిమా 'జైలర్' తెలుగులో కూడా సంచలనం సృష్టించి అద్భుత కలెక్షన్స్ రాబట్టింది, నిర్మాతలకి లాభాలను తెచ్చి పెట్టింది. ఆ సినిమాతో పోలిస్తే ఇప్పుడు 'లాల్ సలాం' సినిమాకి ఎటువంటి ఆర్భాటాలు కనిపించలేదు.

Updated Date - Feb 07 , 2024 | 12:43 PM