మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kanguva: ‘కంగువ’ అప్డేట్ వచ్చింది..

ABN, Publish Date - Feb 21 , 2024 | 03:14 PM

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్‌ను వదిలారు. ఈ సినిమాకు డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ వెల్లడించారు.

Kanguva Movie Still

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ (Kanguva). ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. దిశా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ (Bobby Deol) కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్‌ను వదిలారు. ఈ సినిమాకు డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ వెల్లడించారు.

అంతేకాదు, సూర్య డబ్బింగ్ చెబుతున్నట్లుగా తెలుపుతూ ఒక ఫొటోని, అలాగే డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్‌లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఉన్న మరో ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం సూర్య అభిమానులే కాకుండా.. ప్రేక్షకలోకం మొత్తం ఎంతగానో వేచి చూస్తోంది. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. (Kanguva Movie Update)


పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’లో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్‌ఫార్మెన్స్ హైలైట్ కానున్నాయని మేకర్స్ చెబుతున్నారు. హీరో సూర్య కెరీర్‌లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. త్రీడీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. (Kanguva in Dubbing Stage)


ఇవి కూడా చదవండి:

====================

*Nikhil and Pallavi: పేరెంట్స్‌గా ప్రమోషన్.. చంటిబిడ్డతో నిఖిల్ ఫొటో వైరల్

******************************

*DPIFFA 2024: ఈ అవార్డ్ అంటే ఎంతో ఇష్టం.. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న షారుక్ స్పందనిదే..

***********************************

Updated Date - Feb 21 , 2024 | 03:14 PM