కోలీవుడ్‌కు ముందుగానే సంక్రాంతి.. నాలుగు స్ట్రయిట్ చిత్రాలు.. ఒకటి డబ్బింగ్!

ABN , Publish Date - Jan 13 , 2024 | 11:37 AM

కోలీవుడ్‌కు ముందుగానే సంక్రాంతి కళ వచ్చింది. పొంగల్‌ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐదు చిత్రాలు విడుదల కాగా, వీటిలో ఒక డబ్బింగ్‌ చిత్రం ఉంది. ‘హనుమాన్’ డబ్బింగ్ సినిమా కాగా, ‘కెప్టెన్ మిల్లర్’, ‘అయలాన్’, ‘మెర్రీ క్రిస్మస్’, ‘మిషన్ చాప్టర్ 1’ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలుగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తుండటం విశేషం.

కోలీవుడ్‌కు ముందుగానే సంక్రాంతి.. నాలుగు స్ట్రయిట్ చిత్రాలు.. ఒకటి డబ్బింగ్!
Pongal Movies at Kollywood Box Office

కోలీవుడ్‌కు ముందుగానే సంక్రాంతి (Sankranthi) కళ వచ్చింది. పొంగల్‌ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఐదు చిత్రాలు విడుదల కాగా, వీటిలో ఒక డబ్బింగ్‌ చిత్రం ఉంది. ధనుష్‌ - ప్రియాంక అరుళ్‌ మోహన్‌, అదితి బాలన్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller), శివకార్తికేయన్‌ - రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించిన ‘అయలాన్‌’ (Ayalaan), విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘మెర్రీ క్రిస్మస్‌’ (Merry Christmas), అరుణ్‌ విజయ్‌, ఎమీ జాక్సన్‌, నిమిషా సజయన్‌ నటించిన ‘మిషన్‌ చాప్టర్‌-1’ (Mission Chapter 1) సినిమాలున్నాయి.

Captain-Miller.jpg

వీటితో పాటు తేజ సజ్జా, అమృత అయ్యర్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన ‘హను-మాన్‌’ (HanuMan) చిత్రాన్ని తమిళ నేటివిటీకి తగినట్టుగా డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్ల వద్దా ఆయా హీరోల అభిమానుల కోలాహలం కనిపించింది.


Vijay-sethupathi.jpg

‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రానికి మాత్రం ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉదయం 9 గంటలకే ఈ చిత్ర తొలి ఆట మొదలైంది. దీంతో ధనుష్‌ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. కటౌట్లకు పాలాభిషేకం చేసి డ్రమ్స్‌ వాయిస్తూ డ్యాన్స్‌ చేశారు.

arun-vijay.jpg

అలాగే, దేవికరుమారియమ్మన్‌ థియేటర్‌లో హీరో అరుణ్‌ విజయ్‌ అభిమానులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్‌ చేశారు. శివకార్తికేయన్‌ కూడా తన అభిమానులతో కలిసి చెన్నైలోని ఒక థియేటర్‌లో సినిమా చూశారు. (Kollywood Box Office)


Ayalaan.jpg

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అజిత్‌, విజయ్‌, సూర్య, విక్రమ్‌ వంటి పెద్ద హీరోల చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలకాలేదు. రజనీకాంత్‌ అతిథి పాత్రను పోషించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రం పొంగల్‌కు విడుదల చేయాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. ‘లాల్ సలామ్’ (Lal Salaam) చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైన సినిమాలన్నీ మంచి స్పందననే రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

HanuMan.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Saindhav: వెంకీ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*************************

*King Nagarjuna: మహేష్‌తో కలిసి సినిమా చేస్తాను.. కానీ?

*************************

*Racharikam: ‘రాచరికం’లో అప్సరా రాణి ఎలా ఉందో చూశారా..

**************************

*సింగర్ సునీత కుమారుడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. రిలీజైన 10 రోజులకే!

*************************

Updated Date - Jan 13 , 2024 | 11:37 AM