Mamitha Baiju: మమిత బైజుకు ఆ హీరో సరసన ఛాన్స్

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:28 PM

మలయాళ బ్యూటీ మమిత బైజు.. ఈ పేరు ఈ మధ్య ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ‘ప్రేమలు’ సినిమాలో క్యూట్‌క్యూట్‌గా కనిపించి, కుర్రాళ్ల మనసులు దోచేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు వరస ఆఫర్లు వరిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె పేరు నిత్యం ట్రెండ్ అవుతోంది. అందుక్కారణం ఆమె లవ్‌లీ ఎక్స్‌ప్రెషన్స్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమెకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Mamitha Baiju: మమిత బైజుకు ఆ హీరో సరసన ఛాన్స్
Mamitha Baiju Got Chance in Mythri Movie Makers Film

మలయాళ బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju).. ఈ పేరు ఈ మధ్య ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ‘ప్రేమలు’ (Premalu) సినిమాలో క్యూట్‌క్యూట్‌గా కనిపించి, కుర్రాళ్ల మనసులు దోచేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు వరస ఆఫర్లు వరిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె పేరు నిత్యం ట్రెండ్ అవుతోంది. అందుక్కారణం ఆమె లవ్‌లీ ఎక్స్‌ప్రెషన్స్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమెకు ఓ బంపరాఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులోనూ టాలీవుడ్‌లో టాప్ నిర్మాణ సంస్థగా పేరున్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటంతో.. ఇకపై టాలీవుడ్‌లోనూ మమిత బైజు పేరు మారుమోగడం ఖాయం అనేలా టాక్ మొదలైంది. ఇక విషయంలోకి వస్తే..

Also Read: Super Star Krishna Brother: ఈ ఫొటోలో ఉన్నది కృష్ణ కాదంటే ఎవరైనా నమ్మగలరా?

దర్శకుడు నుంచి హీరోగా మారిన ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) సరసన మమిత బైజు (Heroine Mamitha Baiju) నటించనుంది. ‘సూరరైపోట్రు’ ఫేం సుధా కొంగర (Sudha Kongara) వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కీర్తీశ్వరన్‌ (Keerthiswaran) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కాగా.. హీరోయిన్‌, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతుంది.


Pradeep-and-Mamitha.jpg

ఇందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజును ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా, ‘లవ్‌టుడే’ (LoveToday) చిత్రంతో హీరోగా మారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకున్న ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఎల్‌ఐసీ’, ‘డ్రాగన్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆయన... కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 01 , 2024 | 04:40 PM