Kamal Haasan: మరో సినిమా ఓకే చేసిన ఉలగనాయగన్.. దర్శకులెవరంటే?

ABN , Publish Date - Jan 13 , 2024 | 10:45 AM

ఉలగనాయగన్ కమల్ హాసన్ మరో సినిమాకు సైన్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ‘విక్రమ్’ సినిమా కమల్ హాసన్‌లో ఎనర్జీని నింపడంతో.. ఇక వరసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఈ యూనివర్సల్ స్టార్.. చెప్పినట్లుగానే వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న కమల్.. అన్బరివ్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పారు.

Kamal Haasan: మరో సినిమా ఓకే చేసిన ఉలగనాయగన్.. దర్శకులెవరంటే?
Kamal Haasan

ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) మరో సినిమాకు సైన్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ‘విక్రమ్’ (Vikram) సినిమా కమల్ హాసన్‌లో ఎనర్జీని నింపడంతో.. ఇక వరసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఈ యూనివర్సల్ స్టార్.. చెప్పినట్లుగానే వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ ‘థగ్ లైఫ్’ (Thug Life) చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.


Anbarivu.jpg

#KH237కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. ‘ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో #KH237 దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్ (Anbarivu)... రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFL) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Saindhav: వెంకీ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*************************

*King Nagarjuna: మహేష్‌తో కలిసి సినిమా చేస్తాను.. కానీ?

*************************

*Racharikam: ‘రాచరికం’లో అప్సరా రాణి ఎలా ఉందో చూశారా..

**************************

*సింగర్ సునీత కుమారుడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. రిలీజైన 10 రోజులకే!

*************************

Updated Date - Jan 13 , 2024 | 10:45 AM