మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ilaiyaraaja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది

ABN, Publish Date - Mar 20 , 2024 | 01:49 PM

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా జీవితచరిత్ర ఆధారంగా ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో హీరో ధనుష్‌ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బుధవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇంతకు ముందు ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

Ilaiyaraaja Biopic Still

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా జీవితచరిత్ర (Ilaiyaraaja Biopic) ఆధారంగా ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బుధవారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. 47 ఏళ్లుగా తన సంగీతంతో సినీ ప్రేక్షకులను, శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఇళయరాజా ((Ilaiyaraaja).. ఇప్పటివరకు సుమారుగా 1400కు పైగా చిత్రాల్లో ఏడు వేలకుపైగా పాటలకు సంగీతం అందించారు. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాలైన ‘పద్మ భూషణ్‌’, ‘పద్మ విభూషణ్‌’ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


ఈ నేపథ్యంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే బయోపిక్‌ వివరాలను బుధవారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. విశ్వనటుడు కమలహాసన్‌, ఇళయరాజా, హీరో ధనుష్‌ వంటి అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ బయోపిక్‌కు సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ధనుష్ ఇందులో రెట్రో లుక్‌లో కనిపించనున్నారనేది అర్థమవుతోంది. ఇంతకు ముందు ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. (#IlaiyaraajaBiopic)


ఇవి కూడా చదవండి:

====================

*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

********************************

*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

***************************

*Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

*************************

Updated Date - Mar 20 , 2024 | 03:52 PM