Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:09 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ ‘దేవర’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. బుధవారం జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుండి ఆమె న్యూ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్
Janhvi Kapoor in Devara Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ప్రస్తుతం నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ ‘దేవర’ (Devara). ఈ సినిమాతో ఎన్టీఆర్ (NTR) మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతున్నట్లుగా ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. బుధవారం జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్‌గా (HBDJanhviKapoor) ఈ సినిమా నుండి ఆమె న్యూ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ పేరు ‘తంగం’ (Thangam). ఆమె పేరుతో పాటు నిండైన చీరు కట్టులో ఉన్న ఆమె లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్యూటీఫుల్ బ్యూటీ అంటూ అందరూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దసరా స్పెషల్‌గా ‘దేవర పార్ట్ 1’ చిత్రం అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది (Devara Release Date). ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని ముందుగా మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల ఆలస్యం కారణంగా అక్టోబర్‌కి వాయిదా వేశారు. (Janhvi Kapoor New Poster From Devara)


Devara.jpg

కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. ‘దేవర’ గ్లింప్స్ (Devara Glimpse) ఏ రేంజ్‌లో ట్రెండ్ అయిందో.. సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. అలాగే రీసెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా వైరలైంది. ఇప్పుడు జాన్వీ పోస్టర్‌తో మరోసారి ‘దేవర’ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri KalyanRam) సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ (Anirudh Ravichander) సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Aa Okkati Adakku: థమన్ వదిలిన ‘ఓహ్ మేడమ్’ సాంగ్

***********************

*RC16: అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్

**************************

*Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..

****************************

Updated Date - Mar 06 , 2024 | 12:09 PM